మొదలైన ఈవీఎంల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ముందంజలో ఎవరంటే!!

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతుంది. నువ్వా నేనా అంటూ తలపడిన కర్ణాటక ఎన్నికలలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుంది అన్నది అన్ని రాజకీయ పార్టీలలోనూ టెన్షన్ రేపుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, వర్క్ ఫ్రొం హోమ్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉన్నట్టు సమాచారం.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మొదట బీజేపీ ముందంజలో ఉండగా, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 100 చోట్ల, బిజెపి 75 స్థానాలలో, జెడిఎస్ 16 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపులో ఎవరు ఆధిక్యంలో ఉంటారో తెలియాల్సి ఉంది.

Karnataka Assembly Election Results 2023

మొత్తం 224 స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఓట్ల లెక్కింపు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కి ఈ ఎన్నికలు బస్తీమే సవాల్ కాగా, కాంగ్రెస్ పార్టీకి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అవకాశం మిస్ అయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కష్టమేనని ఒక భావన ఉంది.

కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎన్నికల్లో సత్తా చాటాలని, అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా విజయావకాశాలు ఉన్న స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతుంది. హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష అంటుంది. కచ్చితంగా అధికారంలోకి రావాలన్న దృఢ సంకల్పంతో ఉన్న బిజెపి అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.

కర్ణాటక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుండి లీడింగ్ లో కొనసాగుతున్నారు. మరొక పక్క కర్ణాటక పిసిసి చీఫ్ డికె శివకుమార్ కనకపుర నుండి లీడింగ్ లో కొనసాగుతున్నారు. మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు తేలనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+