ఎస్బీఐలో జాబ్స్ జాతర: 13,735 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: ఏపీ అమరావతికి 50

Jobs in SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయాలనుకుంటోన్న వారికి గుడ్ న్యూస్. ఉద్యోగాల జాతరకు తెర తీసిందీ దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం. వేల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల నేడే చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను దాఖలు చేసే ప్రక్రియ కూడా ఆరంభమైంది.

కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ..

దేశవ్యాప్తంగా క్లర్క్/జూనియర్ అసిస్టెంట్‌ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఎస్బీఐ. ఈ ఖాళీల సంఖ్య 13,735. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగానికి సంబంధించిన ఖాళీలు ఇవి. ఈ ఉద్యోగాల కోసం నేటి నుంచి దరఖాస్తుల దాఖలు ప్రక్రియ ఆరంభమైంది. ఆసక్తిగల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

State Bank of India Clerk recruitment notification is out

చివరి తేదీ..

వీటిని పంపించడానికి చివరి తేదీ జనవరి 7. వచ్చే ఫిబ్రవరిలో ఎస్బీఐ ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు మెయిన్స్‌ రాయడానికి అర్హులు. మార్చి లేదా ఏప్రిల్‌లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. జనవరి 7వ తేదీ తరువాత ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.

కీలక తేదీలు ఇవే..

దరఖాస్తు దాఖలు చేయడానికి అవసరమైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్- డిసెంబర్ 17, 2024

దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీ- జనవరి 1, 2025

ఆన్‌లైన్ ద్వారా పరీక్షా ఫీజుల చెల్లింపు కాల వ్యవధి- డిసెంబర్ 7 2024 నుంచి జనవరి 7 2025 వరకు.

దాఖలు చేసిన దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు చేయడానికి తుది గడువు- జనవరి 7 2025

దాఖలు చేసిన దరఖాస్తులను ప్రింటవుట్ తీసుకోవడానికి చివరి తేదీ- జనవరి 22, 2025

ప్రిలిమినరీ పరీక్షలు- ఫిబ్రవరి 2025

మెయిన్స్ పరీక్షలు- మార్చి/ఏప్రిల్ 2025

ఏపీ అమరావతికి..

ఏపీ రాజధాని అమరావతిలో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. గుజరాత్- 1,073 (బ్యాక్‌లాగ్ 168), మధ్యప్రదేశ్- 1,317, ఛత్తీస్‌గఢ్- 483, కర్ణాటక- 50 (బ్యాక్‌లాగ్- 203), ఒడిశా- 362, హర్యానా- 306 (బ్యాక్‌లాగ్ 2), జమ్మూ కాశ్మీర్- 141, హిమాచల్ ప్రదేశ్- 170 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

యూటీల్లో..

చండీగఢ్- 32, లఢక్- 32, పంజాబ్- 569, తమిళనాడు- 336, పుదుచ్చేరి- 4, తెలంగాణ- 342, రాజస్థాన్- 445, పశ్చిమ బెంగాల్- 1,254 (బ్యాక్‌లాగ్ 10), అండమాన్ నికోబార్- 70, సిక్కిం- 56, ఉత్తరప్రదేశ్- 1,894 (బ్యాక్‌లాగ్ 6), మహారాష్ట్ర- 1,163 (బ్యాక్‌లాగ్ 123) ఖాళీలు భర్తీ అవుతాయి.

గోవా- 20, ఢిల్లీ- 343 (బ్యాక్‌లాగ్ 2), ఉత్తరాఖండ్- 316 (బ్యాక్‌లాగ్ 5), అరుణాచల్ ప్రదేశ్- 66 (బ్యాక్‌లాగ్ 9), అస్సాం- 311 (బ్యాక్‌లాగ్ 58, మణిపూర్- 55 (బ్యాక్‌లాగ్ 3), మేఘాలయా- 85 (బ్యాక్‌లాగ్ 7), మిజోరం- 40 (బ్యాక్‌లాగ్ 1), నాగాలాండ్- 70 (బ్యాక్‌లాగ్ 5), త్రిపుర- 65 (బ్యాక్‌లాగ్ 2), బిహార్- 1,111, జార్ఖండ్- 676, కేరళ- 426 (బ్యాక్‌లాగ్ 12), లక్షద్వీప్- 2 పోస్టులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+