వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ల నిర్వహణలో రాష్ట్రాలు విఫలం-తేల్చేసిన కేంద్రం- విమర్శలు సరికాదన్న వీకే పౌల్‌

|
Google Oneindia TeluguNews

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యలో వ్యాక్సిన్ల నిర్వహణ విషయంలో కేంద్రం విఫలమైందంటూ ఇన్నాళ్లూ రాష్ట్రాలు విమర్శలు చేస్తుండగా.. ఇవాళ కేంద్రం వాటిని తిప్పికొట్టింది. వ్యాక్సిన్ల నిర్వహణలో రాష్ట్రాలు విఫలం కావడం వల్లే ఈ పరిస్ధితి ఎదురైందని కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్ డాక్టర్‌ వీకే పౌల్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రాలు వ్యాక్సిన్ల నిర్వహణ విషయంలో సరైన విధానాలు అవలంబించలేదని, కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను సక్రమంగా వాడుకోలేదని నీతిఆయోగ్‌ సభ్యుడు కూడా అయిన డాక్టర్‌ వీకే పౌల్‌ విమర్శించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ మాత్రమే వ్యాక్సిన్ల వ్యవహారం కేంద్రం చేతుల్లోఉందని, అప్పుడు ఎలాంటి ఇబ్బందులూ లేవన్నారు. మే నుంచి రాష్ట్రాలు వ్యాక్సిన్‌ సేకరించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించిందని ఆయన గుర్తుచేశారు.

States responsible for vaccine administration shortfall: Dr. Paul

Recommended Video

New IT Rules : Facebook తగ్గినా WhatsApp Court Plea | Indian Government || Oneindia Telugu

వ్యాక్సిన్ల కొనుగోలు నుంచి వాటికి ఆమోద ముద్ర వేయడం వరకూ కేంద్రం సక్రమంగానే వ్యవహరించిందని కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్ వీకే పౌల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కేంద్రం .. రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ఇచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రాల డిమాండ్లు పెరగడం వల్లే సొంతంగా కొనుక్కునేందుకు అవకాశమిచ్చామన్నారు. వాస్తవానికి రాష్ట్రాలకు మన దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం దగ్గరి నుంచి అన్ని విషయాలు తెలుసన్నారు. వైద్యం రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశమైనా వారి అభ్యర్దన మేరకు కేంద్రం ఇప్పటివరకూ జోక్యం చేసుకుందన్నారు.

English summary
India’s top COVID-19 adviser Dr. VK Paul has said the States had coerced the Centre into expanding the availability of vaccines despite being aware of being inadequately prepared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X