వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్‌ : బీహార్‌ ప్రచారంలో నితీశ్‌ కుమార్‌పై ఉల్లిపాయలు, రాళ్ల దాడి- ఉద్యోగాల పేరెత్తగానే..

|
Google Oneindia TeluguNews

15 ఏళ్లుగా బీహార్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న సీఎం నితీశ్ కుమార్‌కు మూడో విడత ఎన్నికల ప్రచారంలో ఓటర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. మధుబనిలోని హర్లఖీలో నిర్వహించిన ప్రచార సభలో సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రసంగిస్తుండగా.. ఆయనపై రాళ్లు, ఉల్లిపాయలు విసిరారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అడ్డుగా నిలబడటంతో నితీశ్‌కు ప్రమాదం తప్పింది.

హర్లఖీ ప్రచార సభలో ఉద్యోగాల గురించి నితీశ్‌ మాట్లాడటం ప్రారంభించగానే అప్పటికే తమతో తెచ్చుకున్న ఉల్లిపాయలు, రాళ్లను జనం నితీశ్‌పైకి విసిరారు. ఆయన భద్రతా సిబ్బంది అడ్డంగా నిలబడి రాళ్ల దాడిని అడ్డుకున్నారు. వారిని రాళ్లు వేయనివ్వండి, ఎన్ని వేస్తారో చూద్దాం అంటూ నితీశ్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మద్యనిషేధం అమలవుతున్న బీహార్లో మందు అక్రమంగా రవాణా అవుతుంటే అడ్డుకోలేకపోయావంటూ నితీశ్‌నుద్దేంచి రాళ్లు విసిరిన వాళ్లు నినాదాలు చేశారు. చివరికి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

stones, onions hurled at cm nitish kumar during election rally in bihar

బీహార్లో కరోనా తర్వాత నిరుద్యోగం బాగా పెరిగింది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని నితీశ్‌తో పాటు ఆయన ప్రత్యర్ధి సీఎం అభ్యర్ధి తేజశ్వీ యాదవ్‌ కూడా భారీ హామీలు ఇస్తున్నారు. దీనిపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఇప్పటివరకూ తాము ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని వారు ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. ఇప్పుడు మధుబనిలో ఓటర్ల ఆగ్రహం కూడా ఇదేనని విశ్లేషకులు చెప్తున్నారు.

English summary
Stones and onions were hurled at Bihar CM Nitish Kumar as he spoke about employment during an election rally. The man who threw a piece of onion and brick at the chief minister was shouting that "Liquor is being smuggled and sold openly and you did not succeed in stopping it".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X