'శశికళ కన్నా డేంజర్.. ఒక్కో తప్పుడు ట్వీట్‌కు రూ.200 ఇస్తున్న స్టాలిన్'
స్టాలిన్ అల్లుడు, మారన్ సోదరులు కలిసి వందమంది నిరుద్యోగులను నియమించుకున్నారని, వారి ద్వారా ట్విట్టర్ లో నకలీ ఖాతాలు ఓపెన్ చేయించారని ఆరోపించారు.
చెన్నై: బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి గతకొద్ది రోజులుగా తమిళనాడు రాజకీయ సంక్షోభంపై రోజుకో విమర్శ చేస్తూనే ఉన్నారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకె కార్యనిర్వాహకుడు ఎంకె స్టాలిన్ పై తాజాగా సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు.
స్టాలిన్ అల్లుడు, మారన్ సోదరులు కలిసి వందమంది నిరుద్యోగులను నియమించుకున్నారని, వారి ద్వారా ట్విట్టర్ లో నకలీ ఖాతాలు ఓపెన్ చేయించారని ఆరోపించారు. అంతేకాదు ఆ ఖాతాల నుంచి చేసే ఒక్కో తప్పుడు ట్వీట్ కు వారికి రూ.200 ముట్టజెప్పుతున్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తనను బాధించిందని సుబ్రహ్యణ్యస్వామి పేర్కొనడం గమనార్హం.

అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ కన్నా ఎంకె స్టాలిన్, కేంద్రమంత్రి దయానిధి మారన్ ఆయన సోదరుడు కళానిధి మారన్ లు ప్రమాదకరమైన వ్యక్తులు అని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. మనం చేయాల్సింది ఇంకా మిగిలిపోయే ఉందని తమిళ ప్రజలకు విన్నవించిన ఆయన.. వీళ్లను ఓడించడం ప్రపంచ చరిత్రలో నియంతగా నిలిచిపోయిన హిట్లర్, బెనిటో, ముసోలినిలపై గెలవడం లాంటిదని అభిప్రాయపడ్డారు.
I am unhappy to learn that MK Stalin's Son in law & Marans have hired 100 unemployed youth to put out false ID tweets at Rs 200 per tweet.
— Subramanian Swamy (@Swamy39) February 15, 2017












Click it and Unblock the Notifications