Sugar Price: చేదైన చక్కెర! భారీగా పెరిగిన రేట్లు, కేంద్రం ఏమంటుంది?

రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలో చెరకు, చక్కెర కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. 'రెడ్ రాట్' తెగులు , 'ఎల్ నినో' ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశీయంగా చక్కెర ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ అవాంఛనీయ పరిస్థితుల వల్ల మార్కెట్‌లో చక్కెర ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, పండుగల సమయంలో సామాన్యులపై భార పడకుండా తాత్కాలికంగా రా సరుకు దిగుమతికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ దిగుబడులు తగ్గాయని, ముఖ్యంగా చెరకు పంటపై 'రెడ్ రాట్' తెగులు తీవ్ర ప్రభావం చూపిందని కేంద్ర మంత్రి తెలిపారు. మన దేశానికి ఏటా దాదాపు 280 లక్షల టన్నుల చక్కెర అవసరం కాగా, ప్రస్తుతం దేశంలో అవసరానికి మించి 20 నుంచి 25 లక్షల టన్నుల వరకుదనపు నిల్వలు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ, పండుగల సీజన్‌లో డిమాండ్ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున ఎటువంటి కొరత రాకూడదనే ముందస్తుగా దిగుమతి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Sugar Prices Rise as Red Rot Disease and El Nino Reduce Yields Centre Prepares Raw Sugar Imports
పంచదారపై కేంద్రం కొత్త రూల్స్, ఇకపై 15 రోజులే ఛాన్స్..
పంచదారపై కేంద్రం కొత్త రూల్స్, ఇకపై 15 రోజులే ఛాన్స్..

ధరల పెరుగుదలపై సర్కార్ నిఘా: కిలో రూ. 55 దాటిన లీక్

గత నెల రోజులుగా రిటైల్ మార్కెట్‌లో చక్కెర ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. జూలై 20న కిలో గ్రాముకు సగటున రూ. 48.18గా ఉన్న ధర, ఆగస్టు 20 నాటికి రూ. 55.70కి చేరిందని మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఉత్పత్తి కోత కారణంగానే ఈ మార్పు వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులను అదుపులోకి తెచ్చి, ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

ఇ<strong>థనాల్ దెబ్బకు రికార్డు స్దాయికి పంచదార ధరలు..! జనం గగ్గోలు..!</strong>
థనాల్ దెబ్బకు రికార్డు స్దాయికి పంచదార ధరలు..! జనం గగ్గోలు..!

ప్రతిపక్షాల విమర్శలు: చెరకు రైతుల బకాయిలపై ఫైర్

మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఒకప్పుడు విదేశాలకు చక్కెరను ఎగుమతి చేసిన భారతదేశం, ఇప్పుడు దిగుమతులు చేసుకునే పరిస్థితికి రావడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా విమర్శించారు. మిల్లుల యజమానులు చెరకు సరఫరా చేసిన రైతులకు ఏడాది గడుస్తున్నా బిల్లులు చెల్లించడం లేదని, మద్దతు ధర , సకాలంలో చెల్లింపులు లేకపోవడం వల్లే రైతులు చెరకు సాగుకు దూరమవుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక రైతులను ఆదుకోకుండా విదేశీ దిగుమతులపై ఆధారపడటం సరైన విధానం కాదని హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+