మొబైల్‌పై దెబ్బలు తిన్న బాలిక: హత్యా, ఆత్మహత్యా?
గుర్గావ్: ఓ 18 ఏళ్ల బాలిక గుర్గావ్‌లోని పాఠశాల ఆవరణలో శవమై తేలింది. గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, ఇది ఆత్మహత్యనా, హత్యనా అనే విషయం స్పష్టం కావడం లేదు. ఈ కేసును గుర్గావ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాలలో మొబైల్ ఫోన్ వాడినందుకు గురువారం ఉదయం పూట బాలికను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత 12వ తరగతి చదువుతున్న ఆ బాలిక శవం పాఠశాలలోని రెండవ అంతస్థులో గల బాత్రూం ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు.

బాలిక శవాన్ని పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక బాగా చదువుతుందని పాఠశాల అధికారులు చెబుతున్నారు. పాఠశాల ఆవరణలో మొబైల్ వాడకం నిషేధమని, దీంతో ఉదయం పూట ఫోన్ మాట్లాడినందుకు బాలికను కొట్టారని, క్లాస్ టీచర్ ఫోన్ తీసుకుని వెళ్లిపోయి, తల్లిదండ్రులను పిలిచిందని చెబుతున్నారు.
మొబైల్ ఫోన్ బాలికదేనా, కాదా అనేది కూడా తేలడం లేదు. ఫోన్ గురించి తన తండ్రికి చెప్పవద్దని బాలిక క్లాస్ టీచర్‌ను వేడుకుంది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. గురువారం ఇంగ్లీష్ యూనిట్ టెస్టు జరిగిందని, పరీక్ష బాగా రాసినందుకు సబ్జెక్ట్ టీచర్ బాలికను ప్రశంసించారని టీచర్ చెబుతున్నారు. బాలిక గుర్గావ్‌కు చెందిన ఓ వ్యాపారి కూతురని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications