CCTV: తీహార్ సెంట్రల్ జైల్లో నటి జాక్వలిన్ ఫెర్నాండస్ బాయ్ ఫ్రెండ్ లగ్జరీ లైఫ్, వందల కోట్ల స్కామ్ లో సార్ ?
నటిగా ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జాక్వలిన్ ఫెర్నాండస్ కు తాను బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుని తిరిగిన కేటుగాడు సుఖేష్ చంద్రశేఖర్ అలియాస్ సుఖేష్ కు పోలీసులు సినిమా చూపించారు.
బెంగళూరు/తీహార్/న్యూఢిల్లీ: జాక్వలిన్ ఫెర్నాండస్ అలియాస్ జాక్వలిన్ పేరు చెబితే చాలా మందికి టక్కున ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో ఐటమ్ సాంగ్ గర్ల్ అని చెబుతారు. నటిగా ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జాక్వలిన్ ఫెర్నాండస్ కు తాను బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుతున్న కేటుగాడు సుఖేష్ చంద్రశేఖర్ అలియాస్ సుఖేష్ కు పోలీసులు సినిమా చూపించారు. తీహార్ సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని ఆరోపణలు రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అనుకున్నట్లే కన్నింగ్ ఫెలో సుఖేష్ చంద్రశేఖర్ తీహార్ సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. తీహార్ జైల్లోని సీసీటీవీ క్లిప్పింగ్ బయటకు రావడం కలకలం రేపింది.

ఫేమస్ మోసగాడు
పలువురు ప్రముఖులను మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన చీటర్ సుఖేష్ చంద్రశేఖర్ ఉంటున్న తీహార్ జైలులోని అతని సెల్‌పై పోలీసులు దాడి చేసి రూ. 5 లక్షల విలువైన చెప్పులు, రూ. 80 వేల విలువైన మూడు జీన్స్ ప్యాంట్లతోపాటు పలు విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింంది. తీహార్ జైలులోని సీసీటీవీ ఫుటేజీలలో జైలు అధికారులు దాడికి పాల్పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్న క్లిప్పింగ్స్ బయటకు రావడంతో అవి వైరల్ అయ్యాయి.

తీహార్ జైల్లో లగ్జరీ లైఫ్
పోలీసు అధికారులు, జైలు అధికారుల బృందం తీహార్ జైల్లో సుఖేష్ చంద్రశేఖర్ ఉన్న సెల్ లో సోదాలు చేస్తున్న సీసీటీవీ పుటేజీలు బయటకు వచ్చాయి. ఆసమయంలో సుఖేష్ చంద్రశేఖర్ ఏడుస్తూ కనిపించాడు. అధికారులు రాగానే గాఢనిద్రలో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అధికారులు లోపలికి రాగానే లేచి పక్కనే నిలబడ్డాడు. అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సుఖేష్ చంద్రశేఖర్ బిక్కమొఖం వేసుకుని నిలబడి ఉన్నాడు.

సీసీటీవీ పుటేజీలు వైరల్
తీహార్ సెంట్రల్ జైలులో సుఖేష్ చంద్రశేఖర్ ఉంటున్న సెల్ లో సుమారు తొమ్మింది మంది అధికారులు సోదాలు చేసినట్లు సీసీటీవీ పుటేజీల్లో కనిపిస్తున్నాయి. ఈసారి పలు విలువైన వస్తువులను సుఖేష్ చంద్రశేఖర్ సెల్ లో అధికారులు గుర్తించారు. సోదాలు నిర్వహించిన అధికారులు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ పడుకుంటున్న బెడ్ షీట్ సహా అన్నింటినీ ఎత్తుకెళ్లడం హాట్ టాపిక్ అయ్యింద. అధికారుల వెళ్లిపోయిన తరువాత సుఖేష్ ఒంటరిగా నిలబడి ఉన్న సీసీటీవీ పుటేజీలు బయటకు రావడంతో అవి వైరల్ అయ్యాయి.

వీడు సామాన్యుడు కాదు
సుఖేష్ చంద్రశేఖర్ గదిలోని సీసీటీవీ ఫుటేజీని లీక్ చేసిన వ్యక్తిపై జైలు అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని తీహార్ జైలు చీఫ్ అంటున్నారు. మాజీ రెలిగేర్ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను పరిచయం చేసుకున్న సుఖేష్ చంద్రశేఖర్ తాను కేంద్ర హోం, న్యాయ శాఖ కార్యదర్శిగా చెప్పుకుని ఆమెను మోసం చేశాడు. మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 2021లో అరెస్టు చేశారు.

మేడమ్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్
సుఖేష్ అతని లగ్జరీ లైఫ్ గడపడానికి ఫోర్టిస్ మాజీ ప్రమోటర్ భార్య నుంచి ఏకంగా రూ. 217 కోట్లు లూటీకి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. జైల్లో ఉంటూ ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి శుభాకాంక్షలు తెలిపిన సుఖేష్ వార్తల్లో నిలిచాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కోర్టు హాలు నుంచి బయటకు తీసుకువెళుతున్న సమయంలో విలేకరులతో మాట్లాడిన సుఖేష్ చంద్రశేఖర్ నా గర్ల్ ఫ్రెండ్, నటి జాక్వెలిన్ ఫెర్నాండస్ కు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అని చెప్పాడు.
మేడమ్ కు గ్యారెంటీగా సినిమా ?
నటి జాక్వలిన్ ఫెర్నాండస్ తో ఉన్న సంబంధాల గురించి వార్తా సంస్థలు అడిగిన ప్రశ్నకు సుఖేష్ మాట్లాడుతూ నా వైపు నుండి ఆమెకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అని చెప్పి వెళ్లిపోయాడు.మల్వీందర్ సింగ్ సోదరుడు శివిందర్ సింగ్ తన భార్య అదితి సింగ్‌ను రూ. 200 కోట్లు మోసం చేశాడని కేసు పెట్టారు. అన్నాడీఎంకే రెండు ఆకుల గుర్తును తమిళనాడులో వీకే శశికళ వర్గానికి కేటాయించడానికి తాను డీల్ చేస్తానని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని సుఖేష్ చంద్రశేఖర్ మీద కేసులు నమోదు అయ్యాయి. సుకేష్ చంద్రశేఖర్ ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో రెండు కేసులు కూడా విచారణలో ఉన్నాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications