మా మేడమ్ కు సీటు ఇస్తే ఓకే, సీటు ఇవ్వకున్నా పోటీ మాత్రాం గ్యారెంటి, సుమలత ఫ్యాన్స్ ధీమా !
సిట్టింగ్ ఎంపీ సుమలతా అంబరీష్ మళ్లీ మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆమె సన్నిహితుడు హనకెరె శశికుమార్ తెలిపారు. మండ్యలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శశికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండ్య లోక్ సభ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంటుందన్న నమ్మకం మాకు ఉందని అన్నారు.
నాలుగేళ్లుగా సుమలతా అంబరీష్ మండ్య లోక్ సభ నియోజక వర్గంలో చాలా అభివృద్ధి చేశారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ సుమలతా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని శశికుమార్ చెప్పారు. మైషుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడంలో సుమలతా అంబరీష్ విజయం సాధించారని, కేఆర్ఎస్ డ్యామ్ చుట్టూ అక్రమ మైనింగ్‌పై పోరాటం చేసి అక్రమ మైనింగ్ ను మూసివేయించడంతో సుమలతా అంబరీష్ ముందున్నారని అన్నారు.

అత్యధికంగా దిశా సమావేశాలు నిర్వహించిన ఘనత సుమలతా అంబరీష్ కు మాత్రం సొంతం అయ్యిందని శశికుమార్ వివరించారు. సుమలతా అంబరీష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చారని, అయితే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. ఇదే సమయంలో మండ్య లోక్ సభ నియోజకవర్గాన్ని బీజేపీ నాయకులు జేడీఎస్‌కు వదులుకుంటారనే చర్చ జరుగుతోంది.
సుమలతా ఇప్పటికీ బీజేపీ సభ్యురాలు కాదు, పార్టీయేతర ఎంపీగానే ఉన్నారు. సుమలతా అంబరీష్ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మేం సపోర్ట్ చేస్తామని, మండ్య నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు వదులుకున్నా సుమలత అంబరీష్ పోటీ చెయ్యడం ఖాయం అని ఆమెకు గట్టి మద్దతుదారుడు శశికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండ్యలో ఆధిక్యాన్ని నిలుపుకోగలమన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. అవసరమైతే మండ్య నియోజకవర్గాన్ని సుమలతా నిలబెట్టుకుంటారన్న నమ్మకం మాకు ఉందని శశికుమార్ అన్నారు.
బీజేపీ నాయకులు మండ్య లోక్ సభ నియోజక వర్గాన్ని జేడీఏకు వదిలేసినా సుమలతా మాత్రం పోటీ చెయ్యడం ఖాయం అని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే ఆధిక్యాన్ని నిలుపుకోగలమన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. ఓల్డ్ మైసూర్‌లో బలమైన బీజేపీని నిర్మించాలనే తపన ఉంటే, అవసరమైతే సుమలతాను మండ్య నుంచి పోటీ చేయించాలని ఆమె మద్దతుదారులు బీజేపీ హైకమాండ్ కు మనవి చేస్తున్నారు.

గతంలో సుమలతా భర్త అంబరీష్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజకీయాల్లో మార్పులు సహజం, తరువాత సుమలతా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇఫ్పుడు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు వెళ్లిపోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది, అయితే మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలతాను మళ్లీ పోటి చేయించాలని ఆమె మద్దతుదారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications