వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేనికైనా జవాబిస్తా: సునంద కేసుపై మెహర్ తరార్

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: మాజీ కేంద్ర మంత్రి సునంద పుష్కర్ మృతిచడ పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్ స్పందించారు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె బుధవారంనాడు తెలిపారు. శశి థరూర్‌తో మెహర్ తరార్ సంబంధం విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

తనను వారు ఏ ప్రశ్నలు వేయదలుచుకున్నారో వేయవచ్చునని, తాను అన్నింటికీ సమాధానం ఇస్తానని ఆమె ఓ భారత టీవీ చానెల్‌తో అన్నారు. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా సునంద పుష్కర్ మృతిని హత్య కేసుగా నమోదు చేసిన నేపథ్యంలో 46 ఏళ్ల పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు స్పందించారు.

 Sunanda case: Pakistani journalist Tarar ready to answer any question

తన మరణానికి ముందు సునంద పుష్కర్ - తరార్ ఐఎస్ఐ ఏజెంట్ అంటూ ఆరోపించారు. తన భర్తను వలలోకి లాగుతోందంటూ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ వ్యాఖ్యానించారు. ఆ వివాదం నేపథ్యంలోనే 52 ఏళ్ల సునంద పుష్కర్ నిరుడు జనవరి 17వ తేదీన ఢిల్లీలోని హోటల్లో మరణించారు. థరూర్‌తో తరార్‌కు సంబంధం ఉందని కూడా సునంద పుష్కర్ ఆరోపించారు.

తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడైన శశిథరూర్ సునంద్ పుష్కర్‌ను వివాహం చేసుకున్నారు. వారిద్దరికి కూడా అది మూడో వివాహం. సునంద పుష్కర్ మృతిని హత్య కేసుగా నమోదు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు శశి థరూర్‌తో పాటు మరింత మందిని విచారించే అవకాశం ఉంది.

English summary
Pakistani journalist Mehr Tarar, who was at the centre of a controversy involving former union minister Shashi Tharoor, on Wednesday said that she was ready to answer any question on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X