శశిథరూర్ భార్య: ఎవరీ సునందా పుష్కర్?

దుబాయ్‌లోనే టెకాం అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. సునందకు తొలి వివాహం సంజయ్ రైనా అనే కాశ్మీరీతో జరిగింది. ఆ వివాహం విఫలం కావడంతో కేరళకు చెందిన వ్యాపారవేత్త సుజిత్ మీనన్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే 1997లో రోడ్డు ప్రమాదంలో సుజిత్ మరణించారు. సుజిత్‌తో సునందకు ఓ కుమారుడు(21) ఉన్నాడు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఓ సందర్భంలో శశిథరూర్ భార్య సునంద పుష్కర్‌ను ఉద్దేశించి.. శశి థరూర్‌కు రూ. 50 కోట్ల విలువైన ప్రియురాలు ఉందని ట్వీట్ చేశాడు. దీనికి బదులు ఇస్తూ.. తన ప్రియురాలు(భార్య) రూ. 50 కోట్ల కంటే చాలా విలువైనదని, ఆమెను విలువ కట్టలేమని శశిథరూర్ రీట్వీట్ చేశాడు. ఆమె ప్రేమ కొలవలేనిదని శశిథరూర్ తన సందేశంలో పేర్కొన్నాడు.
గతంలో సునంద పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ తర్వాత 2010లో తన ప్రియుడైన శశిథరూర్ సహాయంతో ఆమె కొచ్చి (ఇండియన్ ప్రీమియర్ లీగ్) జట్టులో రూ. 70 కోట్ల వాటా చేజిక్కించుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. కాగా 2010, ఆగస్టులో శశి థరూర్‌ను వివాహం చేసుకున్నారు. 2012 అక్టోబర్ 30న తిరువనంతపురం విమానాశ్రయంలో తనతో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించి మరోసారి సునంద వార్తల్లోకెక్కారు.
ఆ తర్వాత దుబాయ్‌లో ఖలీజ్ టైమ్స్ విలేకరిపై దురుసుగా ప్రవర్తించడమూ వివాదాస్పదమైంది. చివరకు తన భర్త శశిథరూర్‌కు.. పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మహిళ జర్నలిస్టుతో సంబంధం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం సమసిపోతుందనుకుంటున్న సమయంలోనే సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.












Click it and Unblock the Notifications