పెగాసస్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం-విచారణకు త్వరలో నిపుణుల కమిటీ
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ గూఢచర్యం కేసులో విచారణ డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ కేసు విచారణ కోసం నిపుణుల కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు ఇవాళ ప్రకటించింది. దీనిపై వచ్చేవారం పూర్తి ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సీనియర్ న్యాయవాది సియు సింగ్‌తో... తాము పెగాసస్ వివాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ వారంలో ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే, కమిటీలో ఉంచేందుకు తాను అనుకుంటున్న కొంత మంది వ్యక్తిగత కారణాలతో ఇందులో ఉండదల్చుకోవడం లేదని వెల్లడించారు. దీంతో సీజే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే వారం ఈ కమిటీలో ఉండే నిపుణుల పేర్లను ప్రకటిస్తామని సీజే రమణ తెలిపారు. దీంతో ఈ కమిటీ ఏం చేయబోతోంది, ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారనే దానిపై చర్చ మొదలైంది.

పెగాసస్ స్పైవేర్ వాడకం ద్వారా 300 పైగా భారతీయ మొబైల్ ఫోన్ నంబర్‌లను ట్రాక్ చేసిన్లు ఓ అంతర్జాతీయ మీడియా కన్సార్టియం గతంలో వెల్లడించింది. ఇందులో టాప్ భారతీయ జర్నలిస్టుల నుండి ప్రతిపక్ష నాయకుల వరకు, కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో పెద్దల పేర్లు కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ నాయకుల ఫోన్‌లలో గూఢచర్యం చేయడానికి వీలుగా పెగాసస్ సాఫ్ట్‌వేర్ వాడారా లేదా అనే అంశంపై ఆరా తీయడానికి స్వతంత్ర నిపుణులతో కూడిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం గతంలో ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేయబోతోంది.
Recommended Video
పెగాసస్ సాఫ్ట్ వేర్ ను విపక్ష నేతల్ని, జర్నలిస్టుల్ని టార్గెట్ చేసేందుకు వాడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు కేంద్రం సిద్ధమైంది. కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాల్ని తెలుసుకునేందుకే దీన్ని వాడుతున్నారని గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్రం కూడా పారదర్శకమైన విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో సుప్రీంకోర్టు కూడా కేంద్రం నిర్ణయం తర్వాత విచారణ కమిటీ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications