Article 370 రద్దుపై సుప్రీం కీలక తీర్పు-కేంద్రం నిర్ణయంలో జోక్యానికి నిరాకరణ
జమ్మూకశ్మీర్ ను మూడు ముక్కలుగా చేసే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల క్రితం కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు ఈ తీర్పు చదివిన ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. దీంతో కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించినట్లయింది.
ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ తాము పరిశీలించిన అంశాల్ని కూడా తీర్పులో వెల్లడించారు. ఇందులో మొదటిది ఆర్టికల్ 370 తాత్కాలికమా? అనేది కాగా.. రెండోది ఆర్టికల్ 370(1)ని ఉపయోగించి శాసన సభ ద్వారా 'రాజ్యాంగ అసెంబ్లీ'కి ప్రత్యామ్నాయం చెల్లుబాటు అవుతుందా? అనేది. మూడోది జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ పరిషత్ సిఫార్సు లేకపోవడంతో రాష్ట్రపతి ఉత్తర్వు చెల్లుబాటు కాదా? అనేది కాగా.. నాలుగోది డిసెంబర్ 2018లో విధించిన రాష్ట్రపతి పాలన మరియు తదుపరి పొడిగింపులు చెల్లుబాటు అవుతుందా? అనేది.

ఇక ఐదవ అంశం రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటవుతుందా? అనేది, ఆరోది రాష్ట్రపతి ప్రకటన చెల్లుబాటవుతుందా? అనే అంశంగా తెలిపారు. ఈ ఐదు అంశాల్ని పరిశీలించిన మీదట ఈ తీర్పు ఇస్తున్నట్లు సీజే డీవై చంద్రచూడ్ ప్రకటించారు. అలాగే ఈ తీర్పు వెలువరిస్తున్న సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ భారత యూనియన్లో విలీనానికి ముందు సార్వభౌమాధికారం కలిగి లేదని సీజేఐ తెలిపారు. అలాగే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైన తర్వాత అంతర్గత సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండదన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన మాత్రమేనని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ రద్దయిన తర్వాత కూడా ఆర్టికల్ 370 ఉనికిని నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసే రాష్ట్రపతికి అధికారం ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం చట్టపరంగా సవాల్ చేసేందుకు వీల్లేదని , అలా చేస్తే గందరగోళానికి దారి తీస్తుందని సీజే తెలిపారు. అయితే రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత వాడాల్సిన అధికారాలపై మాత్రం ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో గతంలో విధించిన రాష్ట్రపతి పాలన అమలుకు గతంలోనే సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆయన గుర్తుచేశారు. అయితే జమ్మూ కశ్మీర్ భారత యూనియన్లో విలీనం అయిన దగ్గరి నుంచి చోటు చేసుకున్న పరిణామాల్ని గమనిస్తే ప్రస్తుతం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సీజే ప్రకటించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications