రఘువంశ తిలకుడికి సూర్యతిలకం- మహాద్భుతం
Ayodhya Ram Mandir: నేడు శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవార జాము నుంచే క్రిక్కిరిసిపోయాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో ఏటేటా అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలకు సిద్ధం అయ్యాయి.
అటు ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమైన రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో రామ్ లల్లాను దర్శించుకుంటోన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అయోధ్యాపురి నిండిపోయింది. ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటోన్నారక్కడ. అర్ధరాత్రి నుంచే ఆలయం ముందు బారులు తీరి నిల్చున్నారు.

గత ఏడాది జనవరి 22వ తేదీన రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు.
#WATCH | ‘Surya Tilak’ illuminates Ram Lalla’s forehead at the Ram Janmabhoomi Temple in Ayodhya, on the occasion of Ram Navami
— ANI (@ANI) April 6, 2025
'Surya Tilak' occurs exactly at 12 noon on Ram Navami when a beam of sunlight is precisely directed onto the forehead of the idol of Ram Lalla, forming… pic.twitter.com/gtI3Pbe2g1
అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం అనంతరం శ్రీరామనవమి జరుపుకోవడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అయోధ్యానగరం నిండిపోయింది. బాల రాముడిని దర్శించుకోవడానికి ఆలయాలనికి పోటెత్తారు. సరయూ నదిలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.
రామనవమి సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. విద్యుద్దీపాల వెలుగులో రామమందిరం మెరిసిపోతూ కనిపించింది. ఆలయం ముఖ ద్వారం వద్ద బాల రాముడి నగుమోమును ప్రతిబింబించేలా పూలతో అందంగా అలకరించారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో అయోధ్య మార్మోగిపోతోంది.

ఈ తెల్లవారు జామున 4 గంటలకు గేట్లను తెరిచిన మరుక్షణమే లోనికి పరుగులు తీశారు. కాషాయ దుస్తులు ధరించి, హనుమ ధ్వజాలను చేతపట్టుకుని, జైశ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉప్పెనలా ఆలయంలోనికి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది.
ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. ఆలయానికి దారి తీసే మార్గాల్లో బ్యారికేడ్లను అమర్చారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి అదనపు పోలీసు సిబ్బందిని విధి నిర్వహణలో ఉంచారు.
కాగా- అయోధ్య రాముడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు సూర్య కిరణాలు మూల విరాట్టు నుదుటిన సూర్య తిలకాన్ని అద్దాయి. ఆ సమయంలో గర్భాలయంలో లైట్లన్నీ ఆర్పివేశారు. చీకటి ఆవరించిన గర్భగుడిలోకి వెలుగులు విరజిమ్ముతూ సూర్య కిరణాలు ప్రసరించాయి. రామ్‌లల్లా నుదుటిని తాకాయి.
ఆ వెంటనే ఆలయ ప్రాంగణం మొత్తం ఘంటానాదంతో మార్మోగింది. అర్చకులు శంఖాన్ని పూరించారు. బాల రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణలు, ఘంటా-శంఖానాదంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందక్కడ. జై శ్రీరామ్ అంటూ భక్తుల నినాదాలతో అయోధ్యపురి పులకించింది. శ్రీరామ నవమిని నాడు ఇలా సూర్య కిరణాలు తాకేలా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications