తెలంగాణపై సుష్మా, నిర్మల సీతారామన్ ట్విట్టర్ వార్
హైదరాబాద్: తెలంగాణ అంశం ఇద్దరు బిజెపి మహిళా నేతల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదంపై అనుసరించిన వ్యూహంపై ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఈ ట్విట్టర్ ఈ నెల 20వ తేదీన ప్రారంభమైంది. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి బిజెపి నేతలతో ప్రధాని మన్మోహన్ సింగ్ చర్చలు జరిపి రాజ్యసభలో బిల్లును ఆమోదించిన రోజు నుంచి ఇరువురి మధ్య సమరం సాగుతోంది.
లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అనుసరించిన వైఖరిని తప్పు పడుతూ ట్వీట్ చేసిన వ్యాఖ్యను నిర్మలా సీతారామన్ షేర్ చేశారు. రాజ్యసభలో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ మాదిరిగా లోకసభలో సీమాంధ్ర కోసం సుష్మా స్వరాజ్ నిలబడాల్సి ఉండిందని ట్వీట్ చేసిన వ్యాఖ్యను నిర్మలా సీతారామన్ షేర్ చేశారు.

పార్టీ, తమ నాయకులు తెలంగాణ విషయంలో అదే ఆలోచనతో ఉన్నారని, కానీ నష్టం జరిగిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, సీతారామన్ వ్యాఖ్యను తప్పుపడుతూ పోస్టు చేసిన ట్వీట్‌ను సుష్మా స్వరాజ్ ఆదివారంనాడు రీట్వీట్ చేశాడు. దీంతో ఇరువురి మధ్య సమరం పతాక స్థాయికి చేరుకుంది.
ఇరువురి మధ్య సమరాన్ని గమనించిన బిజెపి సీనియర్ నేతలు జోక్యం చేసుకున్నారు. దీంతో సుష్మా స్వరాజ్ తాను రీట్వీట్ చేసిన వ్యాఖ్యను డిలిట్ చేశారు. లోకసభలో సీమాంధ్ర సమస్యలపై సుష్మా స్వరాజ్ గట్టిగానే మాట్లాడినప్పటికీ బిల్లుకు సవరణలు మాత్రం ప్రతిపాదించలేదు. దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపేయడంతో సుష్మా స్వరాజ్ ప్రసంగం వినే అవకాశం ప్రజలకు రాలేదు.












Click it and Unblock the Notifications