మలేషియా ఎయిర్‌పోర్టులో దిక్కుతోచని స్థితిలో కొడుకు శవంతో తల్లి: సుష్మా సాయం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయులెవరైనా సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసిన వెంటనే స్పందించే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. తాజాగా ఓ నిస్సాహ మహిళకు సాయం చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో కొడుకు మృతదేహంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళ పరిస్థితి తెలిసి ఆమె భారత్‌కు వచ్చేందుకు సుష్మా సాయం చేశారు.

'నా ఫ్రెండ్, అతడి తల్లితో కలిసి ఆస్ట్రేలియా నుంచి భారత్ వస్తుండగా, కౌలాలంపూర్ విమానాశ్రయంలో నా స్నేహితుడు హఠాత్తుగా మరణించాడు. అతడి తల్లి ఒంటరిగా ఉన్నారు. సాయం చేసేందుకు ఎవ్వరూ లేరు' అని అభ్యర్థిస్తూ మరణించిన వ్యక్తి స్నేహితు రమేష్.. సుష్మాకు ట్వీట్ చేశారు.

దీనికి వెంటనే స్పందించిన సుస్మా స్వరాజ్.. కౌలాలంపూర్ భారత హైకమిషనర్‌తో మాట్లాడి ప్రభుత్వ ఖర్చులతో మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయించారు. హైకమిషనర్ అధికారులు వ్యక్తి మృతదేహాన్ని, అతడి తల్లిని మలేషియా నుంచి చెన్నైకి పంపించారని ఆ తర్వాత ట్వీట్ చేశారు. మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులకు సుష్మా సంతాపం తెలియజేశారు. మంత్రి సాయం చేయడంతో ఆమెకు మృతుడి స్నేహితుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
External Affairs Minister Sushma Swaraj today helped an Indian woman in bringing back the mortal remains of her son, with whom she was travelling from Australia to India, after he died suddenly at the Kuala Lumpur international airport.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి