వద్దే వద్దు: గాలి పార్టీపై సుష్మా స్వరాజ్ తీవ్ర స్పందన

Sushma Swaraj opposes BSR merger in BJP
న్యూఢిల్లీ: కర్నాటకలో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బిఎస్సార్ పార్టీతో పొత్తు, విలీనం ఏదీ వద్దని భారతీయ జనతా పార్టీ అగ్ర నేత సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బిఎస్సార్ పార్టీ బిజెపిలో కలుస్తుందనే విషయమై ఆమె తీవ్రంగా స్పందించారు. బళ్లారి మైనింగ్ వివాదంలో ఉన్న బిఎస్సార్ పార్టీతో కలవడానికి తాను వ్యతిరేకమన్నారు.

ఆ పార్టీతో పొత్తు, విలీనం వద్దంటూ తాను పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌కు లిఖిత పూర్వకంగా చెబుతానని తెలిపారు. హర్యానాలో సీనియర్ కాంగ్రెసు నేత వినోద్ శర్మ హర్యానా జనహిత కాంగ్రెసు పార్టీలో చేరడాన్ని కూడా సుష్మా వ్యతిరేకించారు. హర్యానా జినహిత కాంగ్రెసు బిజెపితో పొత్తు పెట్టుకుంది. వినోద్ శర్మ హెచ్‌జెసిలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నానని, ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత కులదీప్ బిష్ణోయ్‌కి చెబుతానని ఆమె ట్వీట్ చేశారు.

మరోవైపు, మధ్యప్రదేశ్‌లో రైతులకు పంట నష్టపరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సుష్మా ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, రైతులను సకాలంలో ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, వెంటనే నష్టపరిహారం ఇప్పించాలని ఆమె రాష్ట్రపతిని కోరినట్టు వెల్లడించారు. రైతులకు జరిగిన అన్యాయంపై సాక్షాత్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రే ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదని హితవు పలికారు.

కాగా, బిఎస్సార్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గాలి ఆత్మీయులు శ్రీరాములు బుధవారం ప్రకటించారు. అధికారం శాశ్వతం కాదని, దేశాభివృద్ధి, నరేంద్ర మోడీని దేశ ప్రధానిని చేయాలన్న ఆలోచనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భగవంతుని కృపతో గాలి జనార్ధన్ రెడ్డి జూన్ లేదా జూలైలో నిర్దోషిగా జైలు నుండి విడుదలవుతారని శ్రీరాములు ఆకాంక్షించారు.

ఒకరిద్దరు పోతే నష్టం లేదు: శశి థరూర్

ఎన్నికల సమయంలో పార్టీల్లో వలసలు సహజమేనని కాంగ్రెసు సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రతిపక్షాల గందరగోళంలో ముగిశాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+