ఒంటరిగా ఉన్న లేడీ, ఇంట్లో వెళ్లి ఏం చేశాడంటే ?, పక్కవీధిలోనే ఉంటున్న భర్త, షాక్ మీద షాక్ !

వివాహం చేసుకున్న దంపతులు వారి పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న హార్డ్‌వేర్ స్టోర్ యజమాని భార్యను గుర్తు తెలియిన వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు వివాహిత మహిళను గొంతు కోసి హత్య చేసిన నిందితులు దర్జాగా పరారయ్యారు.

బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ప్రభాకర్ రెడ్డి లేఅవుట్‌లో నివాసం ఉంటున్న ప్రద్యుమ్న అనే హార్డ్ వేర్ షాపు యజమాని నీలం (30) అనే మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనలో హత్యకు గురైన నీలంకు తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉంటుందని, లేదంటే అంత సులభంగా ఆమె ఇంటికి వెళ్లే అవకాశం లేదని బెంగళూరు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Suspects strangled a woman who was alone at home near Electronic City

భర్త, పిల్లలు బయటకు వెళ్లిన తర్వాత నీలం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో వారి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు నీలంను గొంతుకోసి ఊపిరాడకుండా చేశారు. మృతురాలు నీలం చిన్న కుమారుడు పాఠశాల ముగించుకుని ఇంటికి రాగానే నీలం హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. పదమూడేళ్ల క్రితం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రద్యుమ్న తరువాత నీలంను పెళ్లి చేసుకున్నాడు.

భార్య నీలం, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రభాకరరెడ్డి లేఅవుట్‌లోనే ప్రద్యుమ్న స్థిరపడ్డాడు. ఇంటి సమీపంలోనే హార్డ్‌వేర్ దుకాణం నడిపే ప్రద్యుమ్న పెయింటింగ్ కాంట్రాక్టర్ కూడా పని చేస్తున్నాడు. బెంగళూరు వచ్చిన మొదట్లో కడుపు నింపుకోవడానికి ఉపయోగపడిన పెయింటింగ్ పనిని వదిలిపెట్టకుండా ఇప్పుడు ప్రద్యుమ్న పెయింటింగ్ కాంట్రాక్టర్ గా కూడా పని చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.

Suspects strangled a woman who was alone at home near Electronic City

ఎప్పటిలాగే ఉదయం 9 గంటలకు హార్డ్ వేర్ దుకాణం తలుపులు తెరిచేందుకు నీలం భర్త ప్రద్యుమ్న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు నీలం పిల్లలు పాఠశాలకు వెళ్లారు. నీలం మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఉదయం సుమారు 11.30 గంటలకు ఇంటిలోకి వెళ్లి ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు.

నీలం చిన్న కుమారుడు పాఠశాల ముగించుకుని మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తలుపులు తెరిచి ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న తల్లి నీలంను పైకి లేపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బాలుడి ఏడుపు విన్న ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా నీలం హత్యకు గురైన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారని అధికారులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+