స్వాతి హత్య-మరో ట్విస్ట్: పోలీసులే రామ్‌కుమార్ గొంతుకోశారని తండ్రి ఫిర్యాదు

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కొడుకును గొంతుకోసుకుంటుండగా పట్టుకున్న టెన్‌కాశీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ షెంగొట్టాయి పోలీస్ ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు రామ్‌కుమార్ తండ్రి పరమశివమ్.

స్వాతిని హత్య చేశానిలా: పోలీసులకు రామ్‌కుమార్, 'నిర్ధోషిగా నిరూపిస్తాం'

తన కొడుకు రామ్ కుమార్ తొంతు కోసింది ఇన్‌స్పెక్టర్ బాలమురుగన్ అని పరమశివమ్ ఆరోపించారు. జులై 1న రాత్రి 11.30గంటలకు బాలమురుగన్ నేతృత్వంలోని పోలీసుల బృందమే తన కుమారుడ్ని అరెస్ట్ చేసిందని తెలిపారు. నుంగంబక్కమ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన స్వాతి హత్య కేసులో ఇరికించేందుకే తన కుమారుడ్ని ఏమీ మాట్లాడకుండా గొంతుకోశారని ఆరోపించారు.

Swathi murder: Murderer's father demand

కాగా, పరమశివమ్ ఫిర్యాదును స్వీకరించిన షెంగొట్టాయి పోలీసులు.. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సాక్ష్యాధారాలు లేనందున ఫిర్యాదు నమోదు చేసేందుకు నాలుగు వారాల సమయం పట్టిందని తిరునల్వేలి జిల్లా ఎస్పీ వి విక్రమన్ వెల్లడించారు.

మరో ట్విస్ట్: స్వాతి హత్య మతమార్పిడి వల్లే...

ఈ కేసులో ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదుకు సంబంధించిన పత్రాన్ని అందించామని తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం దర్యాప్తు అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a fresh twist in the Swathi murder case, Ramkumar's father has lodged a complaint in the Shengottai police station against the Tenkasi police inspector who caught him slitting his throat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి