బెంగళూరుకు సిడ్నీలో హత్యకు గురైన టెక్కీ ప్రభ భౌతికకాయం
బెంగళూరు: సిడ్నీలో హత్యకు గురైన బెంగళూరు మహిళా ఐటీ కన్సల్టెంట్ ప్రభ అరుణ్ కుమార్ మృతదేహం స్వస్థలం చేరుకుంది. ప్రభ భౌతికకాయం మంగళూరుకు చేరుకుంది. ఆమె మృతదేహం చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభ అందరు భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రభది కర్నాటకలోని మంగళూరు సమీపంలోని పుత్తూరు గ్రామం. ఆమె అంతిమ సంస్కారాలు పుత్తూరులో జరుగుతున్నాయి. అంతకుముందు ఆమె మృతదేహాన్ని మంగళూరులోని బంధువుల ఇంటిలో ఉంచారు. ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అక్కడే ఉంచారు.
ఆస్ర్టేలియాలోని సిడ్నీ శివారు ప్రాంతంలో గత మంగళవారం ప్రభా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఫోన్లో తన భర్తతో మాట్లాడుతున్న సమయంలో కొందరు దుండగులు ప్రభాను కత్తితో పొడిచి చంపేశారు.

అయితే ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రభా హత్య కేసులో వాస్తవాలు తెలిసినవారెవరైనా పోలీసులకు సమాచారమివ్వాలని ఆమె భర్త అరుణ్ మీడియా ద్వారా కోరారు. ప్రభా హత్యకు గురైన కొన్ని నిముషాల ముందు పరామటా ప్రాంతంలో ఆమె నడుస్తూ వెళ్లిన సీసీటీవీ ఫుటేజీని సిడ్నీ పోలీసులు రిలీజ్ చేశారు.












Click it and Unblock the Notifications