ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ తో నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ అర్షి ఖాన్.. రీజన్ ఇదే

టెలివిజన్ స్టార్ మరియు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్షి ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం వ్యక్తం చేసిన అర్షి ఖాన్ తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను వశం చేసుకోవడంతో తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా వెల్లడించారు.

వణికిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల పాలన

వణికిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల పాలన

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు వశం చేసుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు దారుణంగా మారాయి. తాలిబన్ల గుప్పిట్లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ వాసులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. తాలిబన్ల ఆటవిక పాలనకు భయపడుతున్నారు. మహిళలను హింసించడం, సెక్స్ బానిసలుగా మార్చడం వంటి దారుణాలకు తాలిబన్లు పాల్పడుతున్నారు. తాలిబన్ల దురాక్రమణ వల్ల ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ దేశమంటే ప్రపంచమంతా వణికిపోయే పరిస్థితి నెలకొంది.

ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ తో నిశ్చితార్ధం క్యాన్సిల్ అని చెప్పిన అర్షి ఖాన్

ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ తో నిశ్చితార్ధం క్యాన్సిల్ అని చెప్పిన అర్షి ఖాన్


ఈ క్రమంలో ఈ అక్టోబర్‌లో బిగ్ బాస్ బ్యూటీ అర్షి ఖాన్ ఒక ఆఫ్ఘన్ క్రికెటర్‌తో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు, అయితే తాలిబన్ల కారణంగా రద్దు చేసుకుంటున్నానని వెల్లడించారు. తన తండ్రి తన కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్‌ను ఎన్నుకున్నాడని, అయితే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న కారణంగా కుటుంబం నిశ్చితార్థాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్టుగా ఆమె వెల్లడించారు.తాను వివాహమాడాలి అనుకున్న క్రికెటర్ పేరును వెల్లడించకుండా కేవలం తన నిశ్చితార్థాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు.

తనకు ఆఫ్ఘన్ మూలాలున్నాయన్న అర్షి ఖాన్ .. ఆసక్తికర విషయాల వెల్లడి

తనకు ఆఫ్ఘన్ మూలాలున్నాయన్న అర్షి ఖాన్ .. ఆసక్తికర విషయాల వెల్లడి


బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ అర్షి ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ తన తండ్రి స్నేహితుడి కుమారుడని , ఆమె అతనితో మంచి సంబంధాలు కలిగి ఉందని వెల్లడించారు. తన తల్లిదండ్రులు ఇప్పుడు తన నిశ్చితార్థాన్ని విరమించుకుని, తనకు ఇండియాలో మ్యాచ్ కోసం చూసే అవకాశం ఉందని నటి పేర్కొంది.అర్షి ఖాన్ తన మూలాలను ఆఫ్ఘనిస్థాన్‌లో కలిగి ఉన్నానని వెల్లడించారు. ఆమె ఆఫ్ఘన్ పఠాన్ , ఆమె కుటుంబం యూసుఫ్‌జాయ్ పఠాన్ జాతికి చెందినది. ఆమె తాత ఆఫ్ఘనిస్థాన్ నుండి వలస వచ్చాడని, భోపాల్‌లో జైలర్ గా పనిచేశారని అర్షి ఖాన్ తెలిపారు. ఆమె ఆఫ్ఘన్ మూలాలు ఉన్నప్పటికీ, ఆమె తన తల్లిదండ్రులు భారతీయ పౌరులని, తాను కూడా భారతీయ పౌరురాలినని అర్షి ఖాన్ తేల్చిచెప్పారు.

బిగ్ బాస్ తో బాగా ఫేమ్ అయిన అర్షి ఖాన్

బిగ్ బాస్ తో బాగా ఫేమ్ అయిన అర్షి ఖాన్

అర్షి ఖాన్ ఒక మోడల్ గా , సీరియల్స్ నటిగా మరియు సోషల్ మీడియా స్టార్ గా గుర్తింపు పొందారు. అయితే, ఆమె బిగ్ బాస్ పదకొండవ సీజన్‌లో కనిపించిన తర్వాత ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. మోడల్ అర్షి ఖాన్ అనేక వివాదాలలో చిక్కుకున్న 2017 లో భారతదేశంలో అత్యధికంగా శోధించిన రెండవ ఎంటర్టైనర్‌గా నిలిచింది. అర్షి ఖాన్ 2019 లో కాంగ్రెస్‌లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేశారు. అయితే, 'ప్రొఫెషనల్ కమిట్మెంట్స్' కారణంగా ఆమె రాజీనామా చేశారు.

సినిమాల్లోనూ అర్షి ఖాన్ , వెబ్ సీరీస్ లలోనూ నటిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

సినిమాల్లోనూ అర్షి ఖాన్ , వెబ్ సీరీస్ లలోనూ నటిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

మే 2021 లో, అర్షి తన బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఆమె తన తొలి చిత్రం 'త్రాహిమామ్' లో ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి అయిన చంపా పాత్రను పోషిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె ఇప్పటికే మల్లి మిష్టుతో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. అనేక మ్యూజిక్ వీడియోలు మరియు వెబ్ సిరీస్‌లలో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+