ఇండస్ట్రీకి షాక్, టీవీ నటి సబర్న మృతి: ఆత్మహత్యనా?
చెన్నై: మరో నటి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ తమిళ టీవీ నటి సబర్న శుక్రవారం మృతి చెందారు. ఆమె సినీ నటి, అలాగే టీవీ వ్యాఖ్యాత. యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో నటించింది.
ఆమె తమిళనాడు రాజధాని చెన్నైలోని మధురవాయిలోని నివాసంలో ఆమె విగతజీవిగా శుక్రవారం కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపులు మూసివేసి ఉన్నాయి. శుక్రవారం ఆ ప్లాట్ నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. లోపల మృతదేహం కనిపించింది. పక్కన పోలీసులు సూసైడ్ నోట్ గుర్తించారని తెలుస్తోంది. ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ పలు కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.
సబర్న మృతి విషయం తెలిసి తమిళ టీవీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. కాగా, సబర్న కొద్ది రోజులుగా సంతోషంగా లేదని ఆమె స్నేహితులు చెబుతున్నారు.
ఆమె సూటిగా ఉండే వ్యక్తి అని, అయితే ఆమెకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఆమె రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్ విషయాల్లో చాలా సీరియస్‌గా ఉంటారని, కానీ తన వ్యక్తిగత విషయంలో మాత్రం ఏవో సమస్యలను ఎదుర్కోలేకపోయారని తెలుస్తోందని అంటున్నారు. అయితే మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications