Tamil Nadu Cabinet Expansion: రేపే విజయ్ కేబినెట్ విస్తరణ- కాంగ్రెస్ మంత్రులుగా వీరే..!
తమిళనాడులో కేబినెట్ విస్తరణకు (Tamil nadu Cabinet expansion) రంగం సిద్దమవుతోంది. టీవీకే అధినేత విజయ్ (Vijay) తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తనతో పాటు మొత్తం 10 మంది మంత్రులు మాత్రమే తొలిరోజు ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మిగిలిన మంత్రుల్ని కూడా తీసుకునేలా రేపు కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారు. కేబినెట్లో తమకు మద్దతిస్తున్న పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించాలని విజయ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధాన మితపక్షం కాంగ్రెస్ కు (Congress) 2 బెర్తులు కేటాయించారు.
కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఐదు సీట్లు గెల్చుకుంది. వీరిలో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా ఖరారు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార, పి.విశ్వనాథన్లను తమిళనాడు మంత్రివర్గంలోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. అలాగే వారు రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూడా తెలిపారు.

59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ తమిళనాడు మంత్రివర్గంలో చేరడం తమకు ఒక చారిత్రాత్మక సందర్భమని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వేణుగోపాల్ వెల్లడించారు. వారు తమిళనాడు ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తారని, సంక్షేమం, అభివృద్ధి అనే బృహత్తర దార్శనికతను సాకారం చేయడానికి కృషి చేస్తారని విశ్వసిస్తున్నట్లు వేణుగోపాల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications