మోడీ మైండ్ గేమ్: బీజేపీ చేతిలో పన్నీర్ జుట్టు, గిరిజ ఎవరో తెలుసా ?

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ నియామకంపై బీజేపీ పట్టు సాధించిందని చెప్పవచ్చు. తమిళనాడులో ఏమీ జరిగినా ఇప్పుడు క్షణాల్లో బీజేపీ హై కమాండ్ దగ్గరకు వెళ్లిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు సీనియర్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు మీద ఐటీ అధికారులు దాడులు చెయ్యడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పదవి ఊడిపోయింది.

గురువారం సీఎం పన్నీర్ సెల్వం అత్యవసర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మోహన్ రావుకు ఉద్వాసన పలికారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన గిరిజా వైద్యనాథన్ కు చీఫ్ సెక్రటరీ పోస్టు కట్టబెట్టారు.

గిరిజా వైద్యనాథన్ ను తమిళనాడు చీఫ్ సెక్రటరీగా నియమించడంతో తమిళనాడు బీజేపీ వర్గాల ఆనందానికి అంతులేకుండా పోయింది. అందుకు కారణం ఆమె కుటుంబ సభ్యులు బీజేపీలో క్రీయాశీలకంగా పని చేస్తున్నారు.

Tamil Nadu Chief Secretary: Girija Vaidyanathan takes charge

ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు, అన్నాడీఎంకే పార్టీ మాజీ శాసన సభ్యుడు అయిన ఎస్.వీ. శేఖర్ తమ్ముడు వైద్యనాథన్ భార్యనే ఈ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్. గిరిజా వైద్యనాథన్ కుమారుడి పెళ్లికి అప్పట్లో అన్నాడీఎంకే శాసన సభ్యుడుగా ఉన్న ఎస్.వీ. శేఖర్ డీఎంకే చీఫ్ కరుణానిధిని ఆహ్వానించారు.

ఎస్.వీ. శేఖర్ స్వయంగా కరుణానిధిని గిరిజా వైద్యనాథన్ కుమారుడి పెళ్లికి తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న జయలలిత ఎస్.వీ. శేఖర్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ సమయంలో ఎస్.వీ. శేఖర్ అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేగా పని చేశారు.

తరువాత ఎస్.వీ. శేఖర్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఎస్.వీ. శేఖర్ సెన్సార్ బోర్డులో కీలకపదవిలో ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జోక్యం చేసుకుంటుందని కొన్నిరాజకీయ పార్టీల నాయులు ఆరోపించిన విషయం తెలిసిందే.

సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన గిరిజా వైద్యనాథన్ ను కాదని జయలలిత రామ్మోహన్ రావుకు చీఫ్ సెక్రటరీ పోస్టు కట్టబెట్టారు. గత సోమవారం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత రామ్మోహన్ రావు ఇంటి మీద ఐటీ అధికారులు దాడులు చేశారు.

Tamil Nadu Chief Secretary: Girija Vaidyanathan takes charge

జయలలిత, శశికళ, పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రామ్మోహన్ రావు అక్రమ ఆస్తుల గురించి చాల కాలం నుంచి వివరాలు సేకరించిన ఐటీ అధికారులు సమయం చూసి పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు.

ఇదే సమయంలో ఆయన పదవిలో గిరిజా వైద్యనాథన్ కుర్చోవడంతో గతంలో రామ్మోహన్ రావు చేసిన అధికార దుర్వినియోగం గురించి పూర్తి వివరాలు బయటకు లాగాలని కేంద్రం ప్రయత్నిస్తుందని తెలిసింది.

అయితే కేంద్ర ప్రభుత్వంతో పన్నీర్ సెల్వం మాట్లాడిన తరువాత ఈ తతంగం మొత్తం జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద బీజేపీ కుటుంబ సభ్యులలో ఒకరైన గిరిజా వైద్యనాథన్ తమిళనాడు చీఫ్ సెక్రటరీగా భాద్యతలు స్వీకరించడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వంలో ఏమీ జరిగినా గిరిజా వైద్యనాథన్ కు క్షణాల్లో తెలిసిపోతుంది. అధికారికంగా ఆమెకు తెలియకుండా ఏమీ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. కేంద్రం ఆడిన నాటకంలో అన్నాడీఎంకే చిక్కుకుందా ? ముందు ముందు ఏమీ జరుగుతుందో ? అని వేచి చూడాలని తమిళనాడులోని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+