సీఎస్ నుంచి జయ ఆరోగ్యంపై గవర్నర్ ఆరా: 2 రోజుల్లో కీలక పరిణామాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రధాన కార్యదర్శి సీఎస్ రామ్మోహన్ రావు శుక్రవారం నాడు ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు.
ఈ సందర్భంగా జయలలిత ఆరోగ్య పరిస్థితి పైన ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు వాకబు చేశారు.
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎస్.. గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయ పరిణామాలు ఆసక్తికరం
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జయ ఇంకా ఆసుపత్రిలోనే ఉండటం, ఆమె మరికొద్ది రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి రావడం, స్వామి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో తమిళనాడులో ఏం జరుగుతోందనే చర్చ సాగుతోంది.
రెండు మూడు రోజుల్లో తమిళనాడులో రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయని అంటున్నారు. తాత్కాలిక సీఎంను నియమించవచ్చునని చెబుతున్నారు. లేదంటే ఇంఛార్జ్ ముఖ్యమంత్రిని పెడతారా అనే చర్చ సాగుతోంది. మొత్తానికి గందరగోళంగా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications