చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలాం మృతి: మనస్తాపంతో యువ టెక్కీ ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి చెందడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరుపోరుర్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న డి సుబ్రమణి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు.

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించిన అతని సహోద్యోగి పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, సుబ్రమణి గదిలో ఓ సూసైడ్ నోట్ లభించింది. తాను తన ప్రాణాన్ని కలాంకు నివాళిగా అర్పించాలని కోరుకున్నట్లుగా ఆ సూసైడ్ నోట్‌లో సుబ్రమణి పేర్కొన్నారు.

Tamil Nadu: Depressed over Dr Kalam's death, young techie commits suicide

కలాం మృతితో తాను తీవ్రంగా మనస్తాపానికి గురిచేసినట్లు లేఖలో తెలిపారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని తన తల్లిదండ్రులను కోరారు. ‘నా జీవితంలో స్వచ్ఛమైన, వినయపూర్వకమైన కలాం వంటి మనిషిన చూడలేదు' అని సుబ్రమణి పేర్కొన్నారు.

జులై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో కలాం మృతి చెందిన విషయం తెలిసిందే. భారతదేశంలో అనేక రక్షణ పరిశోధనలు చేసిన కలాంకు దేశ ప్రజలందరూ ఘన నివాళులర్పించారు.

English summary
Nearly one week after his death, a young techie committed suicide for Dr APJ Abdul Kalam. The incident took place at Thiruporur, Kanchipuram district in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X