కిస్సా కుర్సీ కా: శశికళ సిఎం కావాలనుకుంటే, పన్నీర్ కొనసాగాలంటే....

శశికళ సిఎం కావాలనుకుంటే ఏం చేయాలి... పన్నీర్ సెల్వం కొనసాగాలంటే ఏం జరగాలి.. తమిళనాడు కుర్చీలాట రసవత్తరంగా మారింది.

చెన్నై: తమిళనాడులో అన్నాడియంకె రాజకీయాలు కీలకమైన మలుపు తిరిగాయి. పన్నీర్ సెల్వం చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు బావుటా ఎగిరేశారు. ఈ స్థితిలో పట్టుబట్టి తాను ముఖ్యమంత్రిని కావాలని శశికళ కావాలనుకుంటే కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

శశికళకు పార్టీలో ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడం సమస్యగా మారింది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని శశికళ అనుకుంటే, పన్నీర్‌ సెల్వంను ఒంటరిని చేసి ఎమ్మెల్యేలనంతా కాపాడుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఈమె వర్గంలో 70 మంది ఉన్నారు.

Tamil Nadu: if Panneer selavam wants to continue..

కాబట్టి మరో 50 మంది సభ్యుల మద్దతు ఈమెకు అవసరమవుతుంది. అందువల్ల పార్టీలో చీలిక వచ్చినా పన్నీర్‌ వర్గాన్ని 15 మందికి మించనీయకూడదు. ఆమెకు ఎమ్మెల్యేల బలమే ముఖ్యమని చెప్పవచ్చు.. పన్నీర్‌కి బీజేపీ మద్దతిస్తోంది. కాంగ్రెస్‌ శశికళకు సహకరిస్తే, ఆమె తనవైపున్నవారిని కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగితే ఆమెకు సీఎం పదవి దక్కే అవకాశం ఉంది.

జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన పన్నీర్‌ సెల్వం ఆ పదవిలో కొనసాగాలంటే కచ్చితంగా శశికళ మద్దతు అవసరం అవుతుంది. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీలో ఆమె వర్గం ఎమ్మెల్యేలు 70 మంది ఉన్నట్లు సమాచారం. వారందరికీ శశికళే టికెట్లు ఇప్పించి గెలిపించారని చెబుతున్నారు.

ఈ 70 మంది మద్దతు లేకుంటే అన్నాడీఎంకే పార్టీ బలం 65కి పడిపోతుంది. పన్నీర్‌ సెల్వం సీఎంగా కొనసాగడం అంత సులభం కాదు. అప్పడు 89 మంది సభ్యులు గల డీఎంకే మద్దతు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. డిఎంకె మద్దతు ఇస్తే పన్నీర్ సెల్వం గట్టెక్కే అవకాశం ఉంది.

కాగా, అన్నాడీఎంకేలో ఎటువంటి సంక్షోభం లేదని ఆ పార్టీప్రధానకార్యదర్శి శశికళ పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారని, ఎలాంటి సమస్య లేదన్నారు. అలాగే పన్నీర్‌ సెల్వం వెనుక డీఎంకే ఉందని ఆమె ఆరోపించారు. అలాగే పన్నీర్‌సెల్వంపై తాము ఎలాంటి ఒత్తిడి తేలేదని, రాజీనామా చేయాలని బలవంతం చేయలేదని శశికళ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+