బిల్లుపెట్టిన జయ: పంచెకట్టుకి నో చెబితే జైలు, జరిమానా
చెన్నై: తమిళనాట పంచెకట్టును అధికారికం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ప్రైవేటు క్లబ్‌లకు పంచెకట్టుతో వచ్చినా అనుమతించాలనీ, అడ్డుచెబితే సదరు క్లబ్ యజమానికి ఏడాది జైలు శిక్ష, రూ.25 వేలు జరిమానా కూడా విధించేలా బిల్లును రూపొందించారు.
తమిళ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలకు విరుద్దంగా నిబంధనలున్న క్లబ్‌లపై చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా జయలలిత ప్రకటించారు.

కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరైన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాదులను అడ్డుకున్న క్రికెట్ క్లబ్ వార్తలకెక్కిన విషయం తెలిసిందే. దీనిపై గత జూలై 16వ తేదీన సభలో జయలలిత చేసిన ప్రకటన ప్రకారం బుధవారం నిబంధనలను సవరిస్తూ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications