తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించిన డీజీపీ, అదనపు బలగాలు, ఇవే కారణాలు !
తమిళనాడులో రెండు రోజుల పాటు హైలర్ట్ ప్రకటించారు. ఈనెల 27, 28వ తేదీలలో తమిళనాడులో అదనపు పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని ఆ రాష్ట్ర డీజీపీ టీకే. రాజేంద్రన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
చెన్నై: తమిళనాడులో రెండు రోజుల పాటు హైలర్ట్ ప్రకటించారు. ఈనెల 27, 28వ తేదీలలో తమిళనాడులో అదనపు పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని ఆ రాష్ట్ర డీజీపీ టీకే. రాజేంద్రన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్పీలు అందుబాటులో ఉండాలని సూచించారు.
పోలీసులకు ముందుగా ఇచ్చిన అన్ని సెలవులు రద్దు చేస్తున్నామని డీజీపీ టీకే. రాజేంద్రన్ చెప్పారు. తమిళనాడు స్పెషల్ పోలీసు (టీఎస్ పీ) బలగాలను తమిళనాడులోని అన్ని జిల్లాలకు తరలించాలని డీజీపీ టీకే రాజేంద్రన్ సూచించారు.

తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జయలలిత మరణంపై విచారణ కమిటీ వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడంతో మీడియాలో అనేక రూమర్లు వ్యాపించడంతో పోలీసు శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. 19 జిల్లాల్లో పోలీసు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.
గవర్నర్ విద్యాసాగర్ రావ్ చెన్నై చేరుకుని స్వచ్చతాహీ సేవా కార్యాక్రమంలో పాల్గొంటున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రజల మధ్య గొడవలు జరగకుండా పోలీసు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications