TVK: విజయ్ కు వరుస షాకులు..నామినేషన్ రిజెక్ట్..!

తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయాలని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించిన విజయ్‌కు.. అదృష్టం ఈసారి అస్సలు కలిసి రాలేదు. ప్రతిష్టాత్మకమైన ఎడప్పాడి నియోజకవర్గంలో పోటీ చేసి తన సత్తా చాటాలని ఆశించిన దళపతికి, నామినేషన్ల పర్వంలోనే చుక్కెదురైంది. తన అభ్యర్థి అరుణ్ కుమార్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడమే కాకుండా, ఆయన అదృశ్యం కావడం విజయ్ అభిమానులను, పార్టీ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది.

రాజకీయాల్లోకి రావడం ఒకెత్తయితే, అక్కడి క్లిష్టమైన నిబంధనలను అర్థం చేసుకోవడం మరో ఎత్తు. కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకాలు ఉండాలనే చిన్న నియమాన్ని పాటించకపోవడంతో ఎడప్పాడి టీవీకే అభ్యర్ధి అరుణ్ కుమార్ నామినేషన్ వీగిపోయింది. అంటే, ఎన్నికల యుద్ధ భూమిలోకి కత్తి పట్టకుండానే విజయ్ సైన్యం ఓటమిని అంగీకరించినట్లయింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి నిత్యా నామినేషన్ కూడా ఇదే కారణంతో రిజెక్ట్ అవ్వడం పార్టీలోని అజాగ్రత్తను ఎత్తి చూపుతోంది. హేమాహేమీలు పోటీ పడే చోట ఇంతటి చిన్న తప్పులు చేయడం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై విమర్శలకు తావిస్తోంది.

Tamil Nadu Polls 2026 TVK Candidate from Edappadi Goes Missing After Election Nomination Rejection

TVK అభ్యర్థి అదృశ్యం.. కిడ్నాప్ డ్రామానా?

అభ్యర్థి అరుణ్ కుమార్ మాయం కావడం ఈ కథలో అసలైన ట్విస్ట్. నామినేషన్ల పరిశీలన సమయంలో ఆయన కనిపించకపోవడంతో ప్రత్యర్థి పార్టీల వారు కిడ్నాప్ చేశారంటూ టీవీకే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. సినిమాటిక్ స్టైల్‌లో జరిగిన ఈ అదృశ్యం వెనుక రాజకీయ కుట్ర ఉందా? లేక నామినేషన్ రిజెక్ట్ అవుతుందని తెలిసి అభ్యర్థే తప్పుకున్నారా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అభ్యర్థిని కాపాడుకోలేక పోవడం విజయ్ 'లీడర్‌షిప్' కు పరీక్షగా నిలుస్తోంది.

ఎడప్పాడిలో ఖాళీగా మిగిలిన 'విజయ్' జెండా!

అన్నాడీఎంకే దిగ్గజం ఎడప్పాడి పళనిస్వామిని ఆయన సొంత గడ్డపై ఢీకొట్టాలని భావించిన విజయ్ ప్లాన్ ఇప్పుడు రివర్స్ అయింది. నియోజకవర్గంలో టీవీకే జెండా ఎగిరే అవకాశం కూడా లేకుండా పోవడంతో, విజయ్ తొలి ఎన్నికల సమరంలోనే ఒక కీలక స్థానాన్ని కోల్పోయారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, విజయ్ రాజకీయ ప్రయాణంలో ఎదురైన 'మొదటి పరాజయం' అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో యంత్రాంగం లోపించడం వల్లే విజయ్ ఈ షాక్ తిన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ 'తొలి దెబ్బ' నుంచి విజయ్ ఎలా కోలుకుంటారో, మిగిలిన నియోజకవర్గాల్లో తన సత్తా ఎలా చాటుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+