Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..!

తమిళనాడు (tamil nadu)లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ఇండియాకూటమి సాధించిన విజయాలు, ఇప్పుడు దాని హవాకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే-బీజేపీ కూటమి చేస్తున్న ప్రయత్నాలు, మధ్యలో కొత్తగా ఆవిర్భవించిన విజయ్ పార్టీ టీవీకే ప్రభావం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు పలు సర్వే( survey) సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

ఇదే క్రమంలో ప్రముఖ సర్వే సంస్థ పోల్ ట్రాకర్ తమిళనాడులో ఓటర్ల మొగ్గు ఎటో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. వీటి ఫలితాలను ఇవాళ షేర్ చేసింది. ఇందులో ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఏకపక్షంగా జరగబోతున్నట్లు తేల్చేసింది. అధికార డీఎంకే కూటమి మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని పోల్ ట్రాకర్ అంచనా వేసింది. డీఎంకే కూటమితో పోలిస్తే విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఎక్కడో వెనుకబడిందని సర్వేలో తేలిపోయింది. అలాగే విజయ్ కొత్త పార్టీ టీవీకే ప్రభావం ఏమాత్ర లేదని కూడా పోల్ ట్రాకర్ సర్వేలో తేలింది.

Tamil Nadu Polls Poll Tracker Survey Declares Clear Winner in One-Sided Election

పోల్ ట్రాకర్ సర్వే అంచనాల ప్రకారం తమిళనాడు అసెంబ్లీలోని 234 సీట్లలో ఈసారి డీఎంకే కూటమికి 172-178 సీట్లు రాబోతున్నట్లు తేలింది. అలాగే అన్నాడీఎంకే కూటమికి కేవలం 46-52 సీట్లు మాత్రమే దక్కుతాయని అంచనా వేసింది. అలాగే విజయ్ పార్టీ టీవీకే దారుణంగా 6-12 సీట్లకే పరిమితం అవుతుందని పోల్ ట్రాకర్ తేల్చింది. ఎన్టీకేకి 0-2 సీట్లు లభించే అవకాశం ఉందని పేర్కొంది. ఓటింగ్ శాతాలు చూస్తే డీఎంకే కూటమికి 42.7 శాతం ఓటర్లు మద్దతిస్తున్నట్లు తెలిపింది. అలాగే అన్నాడీఎంకే కూటమికి 30.3 శాతం ఓటర్లు, టీవీకేకు 19.2 శాతం ఓటర్లు, ఎన్టీకేకు 5.1 శాతం ఓటర్లు, ఇతరులకు 2.8 శాతం ఓటర్లు మద్దతిస్తున్నట్లు పోల్ ట్రాకర్ సర్వేలో తేలింది.

Tamil Nadu Polls Poll Tracker Survey Declares Clear Winner in One-Sided Election

తమిళనాడు ఓటర్లలో ఓ వర్గం బీజేపీకి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని సర్వేలో చెప్పారు. అలాగే రాందాస్, శశికళ వంటి నేతల వల్ల విపక్ష అన్నాడీఎంకే కూటమి ఓట్లకు గండిపడుతున్నట్లు కూడా తేలింది. అలాగే పళనిస్వామి, విజయ్ తో పోలిస్తే సీఎం ఎంకే స్టాలిన్ ను సమర్ధుడైన నాయకుడిగా ఓటర్లు గుర్తిస్తున్నట్లు తేలింది. కొత్త పార్టీ టీవీకే ..డీఎంకే, అన్నాడీఎంకే కూటుముల ఓట్లకు పలు చోట్ల గండి కొడుతున్నా స్టాలిన్ మహిళా పథకాల వల్ల ఆ వర్గం ఓట్లు అధికార పార్టీతోనే ఉన్నట్లు తేలింది. గతంలో ఎన్టీకే వైపు మొగ్గిన పలువురు ఓటర్లు ఇప్పుడు టీవీకేవైపు మొగ్గుతున్నారు. అన్నాడీఎంకే కూటమిలో పళనిస్వామి తప్ప మరో జనాకర్షక నేత లేకపోవడం మైనస్ గా మారినట్లు సర్వేలో తేలింది. బీజేపీ కారణంగా మైనార్టీ ఓటర్లు డీఎంకే కూటమివైపు మొగ్గుతున్నారని తేలింది. అలాగే ఆది ద్రవిడార్ వర్గం ఓటర్లు అన్నాడీఎంకేపై అసంతృప్తిగా ఉన్నారని, ముదలియార్, నాయుడు, వెల్లలార్, అరుంధతియార్, కల్లార్, ముథరియార్ వర్గాలు డీఎంకే కూటమికి గట్టిగా మద్దతిస్తున్నట్లు తేలింది. టీవీకే రాకతో మత్సకార ఓట్లు అన్నాడీఎంకేతో చీలిపోతున్నాయని, కొంగు వెల్లలార్, వన్నియార్ వర్గాలు మాత్రం అన్నాడీఎంకేతోనే ఉన్నట్లు తేలింది. మిగతా వర్గాలన్నీ డీఎంకేకు మద్దతిస్తున్నట్లు తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+