వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు షాక్ :'నా ఓటు నీకు కాదు 'అంటూ పాట,వైరల్ గా మారిన వీడియో

నా ఓటు నీకు కాదు అంటూ సోఫియా ఆష్రప్ చెన్నై వీధుల్లో శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పాడిన పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:'ప్రజాస్వామ్యం చచ్చిపోయింది' ;నా ఓటు నీకు కాదు 'అంటూ పరోక్షంగా శశికళను ఎత్తిచూపుతూ సోఫియా ఆష్రఫ్ పాడిన పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అన్నాడిఎంకె శాసనసభపక్షనేతగా శశికళ ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది.అయితే గవర్నర్ చెన్నైకు రాకపోవడంతో ఆమెప్రమాణస్వీకార కార్యక్రమం రద్దైంది.

శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారనే వార్త తెలుసుకొన్న సోఫియా ఆష్రప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చెన్నైలోని బిన్నీ రోడ్డులో ఆమె బృందంతో పాట పాడారు.ఈ సాంగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

'ఓట్ల కోసమే ప్రకటనలు, విశ్వసనీయత లేని హమీలు ఎవరూ మంచి వారు కారు' ...'నా ఓటు నీకు కాదు 'అంటూ సూటిగా ఆమె పాడిన పాట వైరల్ గా మారింది.

శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారనే వార్తల నేపథ్యంలోనే ఆమె ఈ పాటను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టగా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.

Sofia ashraf

'దోపిడిదారులు, లంచగొండులు, ద్రోహులు, పార్టీ మారే ఊసరవెల్లులు' అంటూ సాగే ఈ పాటలో రాజకీయ నాయకులు ఇస్తోన్న ఉచిత హమీల ఔచిత్యాన్ని ప్రశ్నించారు. నేనెమైనా సాయమడిగానా, నేనేమైనా నీ సీటు అడిగానా అంటూ ప్రశ్నించారు.

'ప్రజాస్వామ్యం చచ్చిపోయింది 'అంటూ ఆవేదనగా పాటను ముగించారు.ఈ పాట కు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున ఈ పాటకు రెస్పాన్స్ వచ్చింది.

English summary
sofia ashraf is known for her firebrand rap songs on issues like Kodaikanal’s pollution caused by Dow chemicals – she reworked niki minaj’s "anaconda" and gave us the fantastic “Kodaikanal Won’t” – but the young musician has found her vintage way of protesting to resist the ascendance of sasikala natarajan as the chief of aiadmk and now the chief minister of tamil nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X