పన్నీర్ సెల్వం బహిష్కరణ: పార్టీ పదవి నుంచి ఔట్, సంబరాలు
అన్నాడీఎంకే పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీర్ సెల్వంను తొలగించి ఆయన స్థానంలో పార్టీ కోశాధికారిగా దిండిగల్ శ్రీనివాస్ ను నియమిస్తూ శశికళ ఆదేశాలు జారీ చేశారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న తనను బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు కోరుకుంటే తాను రాజీనామాను వెనక్కి తీసుకుంటానని పన్నీర్ సెల్వం బహిరంగంగా మీడియా ముందు చెప్పడంతో అన్నాడీఎంకే చీఫ్ శశికళ మండిపడ్డారు.
అన్నాడీఎంకే పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీర్ సెల్వంను తొలగించారు. పన్నీర్ సెల్వం స్థానంలో పార్టీ కోశాధికారిగా దిండిగల్ శ్రీనివాస్ ను నియమిస్తూ శశికళ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పన్నీర్ సెల్వం వర్గీయులు సంబరాలు చేసుకున్నారు.

శశికళ మద్దతుదారులు పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తమిళనాట పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
బుధవారం గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు తమిళనాడు అపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కలవనున్నారు. తరువాత గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. పన్నీర్ సెల్వం ఒక్క సారిగా తిరుగాటు చెయ్యడంతో నెచ్చెలి శశికళ షాక్ కు గురైనారు.












Click it and Unblock the Notifications