తమిళనాడు రైతుల నగ్న నిరసన: ప్రధాని కార్యాలయం ఎదుట ఉద్రిక్తత!..
ఇవే డిమాండ్లతో గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: కరువు ఉపశమన ప్యాకేజీతో పాటు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట తమిళనాడు రైతులు నిరసనకు దిగారు. వినూత్న రీతిలో రైతులంతా నగ్నంగా సామూహిక నిరసన తెలపడం గమనార్హం. పీఎంవో కార్యాలయం సహా రైతులంతా సౌత్ బ్లాక్ ఎదుట నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కాగా, ఇవే డిమాండ్లతో గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు.

గతంలో పుర్రెలు, ఎముకలతో నిరసన వ్యక్తం చేసిన రైతులు.. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో గొంతులు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరించారు. తమిళనాడు రైతుల నిరసన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కేంద్రం తుఫాను సహాయం కింద రూ.2,014.45కోట్లను ప్రకటించింది.












Click it and Unblock the Notifications