Target: ఆ నగరం మాకు ఇచ్చేస్తే మాపని మేము చేసుకుంటాము, సీఎం డిమాండ్, మీ పెత్తనం వద్దు !
పంజాబ్/చండీగఢ్: అమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ తరువాత అధికారం చేపట్టిన రాష్ట్రం పంజాబ్. ఇటీవల పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్ములేపిన అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వారంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలనానికి తెర లేపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది, చండీగఢ్ నగరాన్ని పంజాబ్ కు ఇచ్చేయాలని పంజాబ్ అసెంబ్లీ సంచలన తీర్మానం చేసింది. పంజాబ్ కు చండీగఢ్ ఇచ్చేస్తే మా పని మేము చేసుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అంటున్నారు. చండీగడ్ నుంచి కాకకుండా బయటి వాళ్లు (కేంద్ర సర్వీసు ఉద్యోగులు) నియమించడం పట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకాలం కొనసాగిన సమతుల్యతను కేంద్ర ప్రభుత్వం దెబ్బ తియ్యాలని చూస్తోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. చండీగఢ్ పై పూర్తి హక్కులు పంజాబ్ వే అని, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఇక సహించమని, మా హక్కులు మేము సాధించుకుంటామని, అందుకు ఎంతవరకు అయినా పోరాటం చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తేల్చి చెప్పారు.

చండీగఢ్ ను పంజాబ్ కు ఇచ్చేయాలి
చండీగఢ్ నగరాన్ని పంజాబ్ కు ఇచ్చేయాలని పంజాబ్ అసెంబ్లీ సంచలన తీర్మానం చేసింది. పంజాబ్ కు చండీగఢ్ ఇచ్చేస్తే మా పని మేము చేసుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అంటున్నారు. చండీగడ్ నుంచి కాకకుండా బయటి వాళ్లు (కేంద్ర సర్వీసు ఉద్యోగులు) నియమించడం పట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు.

టార్గెట్ కేంద్ర ప్రభుత్వం ?
శుక్రవారం పంజాబ్ ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి ఆర్థిక మంత్రి హరపాల్ సింగ్ చీమా మద్దతు ప్రకటించగా ఈ తీర్మానాన్ని పంజాబ్ శాసనసభ ఎకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ పంజాబ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ తీర్మాణం ప్రవేశపెట్టారని తెలిసింది.

ఇటీవల అమిత్ షా ఏం చెప్పారంటే ?
పంజాబ్ సర్వీస్ రూల్స్ కు బదులు చండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని ఇటీవల కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా చెప్పారు. ఈనేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన తీర్మానం హాట్ టాపిక్ అయ్యింది చండీగఢ్ పంజాబ్ కు పూర్తి రాజధానిగా ఉండాలని పంజాబ్ శాసనసభ చేసి తీర్మానం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కేంద్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోంది
ఇంతకాలం కొనసాగిన సమతుల్యతను కేంద్ర ప్రభుత్వం దెబ్బ తియ్యాలని చూస్తోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. చండీగఢ్ పై పూర్తి హక్కులు పంజాబ్ వే అని, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఇక సహించమని, మా హక్కులు మేము సాధించుకుంటామని, అందుకు ఎంతవరకు అయినా పోరాటం చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తేల్చి చెప్పారు.

రాష్ట్రం విడిపోయినా ఇంకా ఎందుకు ?
గతంలో రాష్ట్రాలు విడిపోయిన సందర్బాల్లో రాజధాని మాతృరాష్ట్రంతోనే ఉన్న విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రస్తావించారు. అందువలన చండీగఢ్ ను పంజాబ్ కు బదిలి చెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అంటున్నారు. 1996 చట్టం ప్రకారం పంజాబ్ రాష్ట్రం ఏర్పడింది ఆపై పునర్వ్యవస్థీకరణతో హర్యానా పుట్టుకొచ్చింది.

వెయిట్ అండ్ సీ
తరువత పంజాబ్ లోని కొంత భాగం హిమాచల్ ప్రదేశ్ లో కలిసిపోయింది. అప్పటి నుంచి భాక్రా బియస్ మేనేజ్ మెంట్ బోర్డు సంయుక్త ఆస్తుల మీద పరిపాలనను పంజాబ్-హర్యానాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు పంజాబ్ శాసనభలో చండీగఢ్ ను మాకు ఇచ్చేయాలని తీర్మాణం చెయ్యడంతో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications