జ్యోతిరాదిత్య సింధియాకు అనూహ్య టాస్క్ -మంత్రిగా మొదటి పని ఇదే -ఇచ్చింది ప్రధాని మోదీ కాదు

ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణాలు చేశారు. అయితే, కేబినెట్ కూర్పునకు ముందు, ఆ తర్వాత కూడా జ్యోతిరాదిత్య సింధియా పేరు వార్తల్లో బాగా నిలుస్తోంది. బుధవారం ఆయన ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది సేపటికే అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో మోదీని తిట్టినప్పటి(పాత) వీడియోను హ్యాకర్లు పోస్ట్ చేయడం, ఈ విషయమై గ్వాలియర్ లో పోలీస్ కేసు కూడా నమోదు కావడం తెలిసిందే. అయితే, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరునిమిషమే ఆనయకు అనూహ్య టాస్క్ నిర్వహించే బాధ్యత పడింది..

పౌర విమానయాన శాఖ (సివిల్ ఏవియేషన్) మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో తొలిసారి ఆసీనుడయిన కొద్దిసేపటికే ఆయన తలపై భారీ బాధ్యత పడింది. సాధారణంగా మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ టాస్కులు అప్పగిస్తుంటారు. కానీ సింధియా విషయంలో తొలి టాస్క్ అప్పగించింది ప్రధాని కాదు, బాంబే హైకోర్టు!

task-no-1-as-aviation-minister-is-bombay-high-court-to-jyotiraditya-scindia

పౌరవిమాన మంత్రిగా సింధియా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది నిమిషాలకే ఆయనకు బాంబే హైకోర్టు కీలక టాస్క్ అప్పజెప్పడం విశేషం. దేశంలో విమానాశ్రయాలకు తరచూ పేర్లు మార్చుతుండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేరు మార్చే విషయంలో దేశవ్యాప్త విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని, ప్రత్యేకించి విమానయాన మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

''ఎయిర్ పోర్టులకు పేర్లు మార్చే నూతన విధానం ఇంకా రూపుదిద్దుకునే దశలోనే ఉంటే... వెంటనే పూర్తి చేయండి. కేంద్రంలో కొత్త కేబినెట్ ఏర్పడింది. ఈ పనిని పౌరవిమానయాన శాఖకు అప్పగించండి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పౌరవిమానయాన శాఖ మంత్రికి ఇది మొదటి టాస్క్ కావాలి'' అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.

విమానాశ్రయాలకు వ్యక్తుల పేర్లు పెట్టకూడదని, కేవలం నగరాల పేర్లు మాత్రమే పెట్టాలని 2016 లో అప్పటి ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలని అనుకుంది. కానీ సదరు విధానం ఇంకా అమలులోకి రాలేదు. దీంతో చాలా చోట్ల ఎయిర్ పోర్టుల పేర్ల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నవీ ముంబై ఎయిర్ పోర్టుకు బాల్‌థాకరే పేరును పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా, అసలు పేర్లు మార్చే విధానం ఏ దశలో ఉంది చెప్పాలంటూ ఫెడరిక్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. దానిపై విచారణ సందర్భంగా ఏవియేషన్ మంత్రి సింధియాకు కోర్టు తొలి టాస్క్ అప్పగించింది. ఇదిలా ఉంటే,

గతంలో కాంగ్రెస్ నేతగా ఉండి, హైకమాండ్ తో విభేదాలతో ఎమ్మెల్యేలను చీల్చి, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారును పడగొట్టిమరీ బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు పంపిన బీజేపీ, ఇప్పుడు కేంద్ర మంత్రిని కూడా చేసింది. కాగా, ఒకే కామెంట్ తో రెండు టార్గెట్లు తరహాలో సింధియా, బీజేపీలను ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసిన కార్టూన్ క‌ల‌క‌లం రేపింది. ''ఫర్ సేల్(అమ్మకానికి సిద్ధం)''అని రాసున్న అక్షరాలు.. అటు సింధియాతోపాటు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తోన్న బీజేపీని కూడా టార్గెట్ చేసేలా ఉన్నాయి. ఈ పోస్ట్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+