• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ సర్వేలో టీడీపీకి వచ్చే సీట్లు ఇవే.. రెబల్ ఎంపీ రఘురామ జోస్యం

|
Google Oneindia TeluguNews

రఘురామ కృష్ణరాజు.. వైసీపీకి పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఎప్పుడూ అధికార పార్టీని విమర్శిస్తూనే ఉంటారు. టీడీపీ, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ.. సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తుంటారు. ఇప్పడు ఎన్నికల్లో వచ్చే సీట్లు, సర్వే గురించి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ బంపర్ విక్టరీ కొడుతోందని చెప్పారు. అంతేకాదు.. ఇదీ తన మాట కాదని.. వైసీపీ చేసిన సర్వేలో తేలిందని కామెంట్ చేశారు.

జగన్ ధీమా.. రఘురామ ఇలా..

జగన్ ధీమా.. రఘురామ ఇలా..


ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ నెలకొంది. సీట్ల లెక్కలపై జోరుగా కామెంట్లు చేస్తున్నారు. పార్టీలు ఇంటర్నల్‌గా సర్వే కూడా చేస్తున్నారు. కానీ పైకి మాత్రం అధికారం తథ్యం అంటూ కామెంట్ చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీట్లపై సీఎం జగన్ కూడా ధీమాతో ఉన్నారు. 175 స్థానాల్లో తమ పార్టీదే విజయం అని అంటున్నారు. రెండు రోజుల క్రితం కూడా అదే కామెంట్ చేశారు. కానీ దీనిని సొంత పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యతిరేకించారు. వైసీపీ చేసిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయని వివరించారు.

టీడీపీకి 115 సీట్లు అట..

టీడీపీకి 115 సీట్లు అట..


వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే అధికారం అని తేలిపోయిందని చెప్పారు. తమ పార్టీ చేసిన సర్వేలో టీడీపీకి 115 సీట్లు వస్తాయని తేలిందని చెప్పారు. వైసీపీకి మాత్రం 60 సీట్లే వస్తాయని.. ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని తేలిపోయిందని చెప్పారు. కానీ సీఎం జగన్ పైకి 175 సీట్లు వస్తాయని ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంటర్నల్ సర్వే మాత్రం టీడీపీకి అధికారం తథ్యం అని తేలిపోయిందని వివరించారు.

 120 మంది టికెటే అడగరట

120 మంది టికెటే అడగరట

పనిచేయని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని సీఎం జగన్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. దీనిపై రఘురామ స్పందించారు. 100 మంది ఎమ్మెల్యేలు అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదట. కానీ 120 మంది అసలు పార్టీ టికెట్లే అడగరని రఘురామ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు గడప గడపకు కార్యక్రమం భయం భయంగానే సాగుతోందని చెప్పారు. జనం ఏమంటారోనని ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు.

Recommended Video

  Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
   మైనస్ 1: కరెంట్ కోతలు

  మైనస్ 1: కరెంట్ కోతలు


  వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్లు అవుతోంది. ప్రధానంగా విద్యుత్ కొరత సమస్య జగన్ సర్కార్‌కు మైనస్ అయ్యింది. ముఖ్యంగా వేసవిలో జనం చిర్రెత్తిపోయారు. సమయం, సందర్భం లేకుండా కరెంట్ తీయడం.. జనం మెదళ్లలో పేరుకుపోయింది. ఎమ్మెల్యేలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పరిశ్రమలకు కూడా పవర్ హాలీడే ఇచ్చారు. ఇదీ కూడా మైనస్సే... పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సింది పోయి.. ఇలా చేయడం ఏంటీ అనే చర్చ జరిగింది. ఆ తర్వాత పవర్ హాలీడే ఎత్తి వేశారు.

   మైనస్ 2: విద్యార్థుల ఫెయిల్

  మైనస్ 2: విద్యార్థుల ఫెయిల్


  మరో ప్రధాన అంశం కూడా సర్కార్‌కు ఇబ్బంది కలిగించింది. ఇటీవల విడుదలయిన పదో పరీక్ష ఫలితాల్లో 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. ఈ స్థాయిలో తప్పడం అంటే మాములు విషయం కాదు. అయితే రిజల్ట్ విడుదల చేసే తేదీ వాయిదా పడటం.. ఆ తర్వాత రిలీజ్ చేయడంతో అనుమానాలకు కారణమైంది. తర్వాత ప్రభుత్వం మేల్కొని సప్లిమెంటరీ రాసి పాయిసన విద్యార్థులను రెగ్యులర్‌గా పరిగణిస్తామని చెప్పింది. అయినప్పటికీ ఈ అంశం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యింది. అమ్మ ఒడి పథకం కోసం ఇంతమందిని ఇలా ఫెయిల్ చేశారా అని విపక్షాలు ఆరోపించాయి. ఈ రెండు అంశాలు జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా నిలిచాయి. దానిని బట్టే సర్వే ఫలితం వచ్చి ఉంటుంది. కానీ అధికార పార్టీ దానిని హైడ్ చేయగా.. రఘురామ మాత్రం బయటపెట్టారు.

  English summary
  tdp get 115 seats at ysrcp survey rebel mp raghu ramakrishna raju made sensational comments
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X