మద్యం తాగి హోటల్ టెర్రాస్‌పై నుంచి పడి టెక్కీ మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం రాత్రి ఘోరం జరిగింది. చెన్నైలోని అన్నా సాలై హోటల్ టెర్రాస్‌పై నుంచి పడి 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మరణించాడు.
మృతుడిని పరమేశ్వరన్‌గా గుర్తించారు. ఎరోడ్‌కు చెందిన పరమేశ్వరన్ పూణేలోని ఐబిఎంలో పనిచేస్తున్నాడు. అతను ట్రిప్లికేన్‌లోని లాడ్జిలో బస చేశాడు. మంగళవారం రాత్రి అన్నా సాలైలోని రెయిన్ ట్రీ హోటల్‌కు వెళ్లాడు.

పరమేశ్వరన్ హోటల్‌లో మద్యం సేవించి బిల్లు చెల్లించాడు. ఆ తర్వాత టెర్రాస్‌పైకి వెళ్లి అక్కడి నుంచి కింద పడి మరణించాడు. పోలీసులు ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. తైనామ్‌పేట పోలీసులు కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications