వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ల వృధా విమర్శలపై తెలుగు రాష్ట్రాల ఫైర్‌- లెక్కలు తప్పు- సమాచారలోపమే

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు భారీగా వృధా కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై తెలుగు రాష్ట్రాల నిరాసక్తతపై ప్రధాని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా లెక్కలపై దృష్టిసారించాయి. కేంద్రానికి తాజాగా రాసిన లేఖలో తెలంగాణ సర్కార్‌.. కోవిడ్ వ్యాక్సిన్ల వృధాపై కేంద్రం చెబుతున్న లెక్కలు సరికాదని తెలిపింది. తెలంగాణలో కేవలం 1 శాతం లోపే వ్యాక్సిన్లు వృధా అయ్యాయని పేర్కొంది. అటు ఏపీలో కూడా వ్యాక్సిన్లకు సరైన స్పందన లభించడం లేదని తేలుస్తోంది.

 కరోనా వ్యాక్సిన్ల వృధా వ్యవహారం

కరోనా వ్యాక్సిన్ల వృధా వ్యవహారం

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను కేంద్రం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను ఆయా చోట్లకు పంపింది. అయితే స్ధానికంగా ఉన్న పరిస్ధితుల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పలు చో్ట్ల చురుగ్గా సాగడం లేదు. దీంతో వ్యాక్సిన్లు వృధా అయిపోతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్రం.. వ్యాక్సిన్ల వృధాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల వృధా రేటు డబుల్ డిజిట్‌ ఉండటంపై ప్రధాని సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయా రాష్ట్ర్రాల వివరణ కూడా కోరారు.

వ్యాక్సిన్ల వృధా ఒక శాతం లోపేనన్న తెలంగాణ సర్కార్‌

వ్యాక్సిన్ల వృధా ఒక శాతం లోపేనన్న తెలంగాణ సర్కార్‌

తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ల వృధాపై కేంద్రం ప్రకటించిన గణాంకాలపై తెలంగాణ సర్కార్‌ ఆగ్రహంగా ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో కరోనా వాక్సిన్ల వృధా ఒక్క శాతం లోపే ఉందని తాజాగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు పంపిన లేఖలో తెలంగాణ సర్కార్‌ పేర్కొంది. కేంద్రం చెబుతున్నట్లుగా తెలంగాణలో 17.6 శాతం వృధా లేదని వివరణ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచార లోపం వల్లే గణాంకాల లెక్కింపులో గ్యాప్‌ వచ్చిందని తెలిపింది. నిన్న కేంద్రానికి పంపిన లేఖలో తమకు 9.93 లక్షల డోసులు అందాయని, ఇందులో 40 వేల డోసులు ఆర్మీ కోసం ఇచ్చారని, 1270 మాత్రమే బఫర్‌ స్టాక్‌కు కేటాయించారని పేర్కొంది. కేంద్రం పంపిన వాటిలో 9.43 లక్షల డోసులు వాడామని, కేవలం 7299 డోసులు మాత్రమే వృధా అయ్యాయని తెలిపింది. ఇది కేవలం 0.76 శాతమని పేర్కొంది.

 ఏపీలో వ్యాక్సిన్ల వృధా ఐదుశాతం లోపే

ఏపీలో వ్యాక్సిన్ల వృధా ఐదుశాతం లోపే

ఏపీలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం పంపిన డోసులు కూడా వృధా కావడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కేంద్రం పంపిన డోసుల్ని పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా జనం ఆదరిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం జనంలో భయాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆశావర్కర్లు, అంగన్‌ వాడీ వర్కర్లు ఇంటింటిటీ తిరిగి వ్యాక్సిన్లపై అపోహలు తొలగిస్తున్నారు. అయితే కేంద్రం చెప్తున్నట్లు 10 శాతం వృధా లేదని, కేవలం 5 శాతం కంటే తక్కువగానే వ్యాక్సిన్ల వృధా ఉందని అధికారులు చెప్తున్నారు.

 అందరికీ వ్యాక్సినేషన్‌ నినాదానికి మిశ్రమ స్పందన

అందరికీ వ్యాక్సినేషన్‌ నినాదానికి మిశ్రమ స్పందన


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల కూడా అందరికీ వ్యాక్సినేషన్ నినాదం ముందుకు తెస్తున్నా ప్రజల్లో నెలకొన్న భయాల వల్ల వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోంది. దీంతో వ్యాక్సిన్లను భద్రపరిచే అవకాశం లేక పలుచోట్ల వృధా అవుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో అందరికీ కాకపోయినా 60 ఏళ్ల పైబడిన వృధ్దులతో పాటు 45 ఏళ్లు పైబడిన వారందరిక వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల ఈ వృధాను అరికట్టవచ్చని ఇండియన్‌ మెడికల్‌ అసోసేయేషన్ కేంద్రానికి సలహా ఇస్తోంది.

English summary
Days after it was called out for having a purported vaccine wastage rate of 17.6%, the highest in the country, Telangana has written to the union health ministry, stating that there has been a “miscommunication between both governments over the vaccination figures”. It has added that the vaccine wastage rate in the state is less than 1%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X