పెద్ద నిర్ణయం..తొందరేముంది? ఆఖరు కాదు: టిపై షిండే
న్యూఢిల్లీ: తాము పెద్ద నిర్ణయం తీసుకుంటున్నామని, తొందరేముందని కేంద్ర హోంశాఖ మంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యుడు సుశీల్ కుమార్ షిండే బుధవారం వ్యాఖ్యానించారు. గురువారం జరగబోయే కేబినెట్ సమావేశంలో జివోఎం నివేదిక రాకపోవచ్చునని చెప్పారు. అలాగే రేపటిదే జివోఎం చివరి సమావేశం కాకపోవచ్చునన్నారు.
ఇంకా ఒకటి రెండుసార్లు సమావేశం కావాల్సి ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు. అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలా ఆలోచించాలన్నారు. అదే సమయంలో వచ్చే వారం కేంద్రమంత్రివర్గం ముందుకు ముసాయిదా నివేదిక రావొచ్చునని చెప్పారు.

371డి సవరణ జరగాలి: యనమల
రాష్ట్ర విభజన ప్రక్రియకు ముందైనా తర్వాతైనా ఆర్టికల్ 371డి సవరణ జరగాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు హైదరాబాదులో అన్నరు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం లేదా స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టినా నోటీసు ఎవరైనా ఇవవవచ్చునన్నారు.
తనపై అవిశ్వాసం నోటీసు వస్తే దానికి సంబంధించిన చర్చలో మాత్రమే స్పీకర్ పాల్గొనరని రాష్ట్ర విభజనపై చర్చను యథాతథంగా కొనసాగించవచ్చునని చెప్పారు. ముఖ్యమంత్రి, స్పీకర్ మధ్య వివాదం కాంగ్రెసు అంతర్గత వ్యవహారం అన్నారు.
అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదు కాబట్టి సమావేశాలు ఎప్పుడైనా నిర్వహించే సర్వాధికారాలు స్పీకర్‌కు ఉంటాయన్నారు. రాష్ట్రవిభజనపై తీర్మానం లేదా బిల్లు అసెంబ్లీతో పాటు మండలికి తప్పనిసరిగా రావాలన్నారు.












Click it and Unblock the Notifications