షాక్: జియోతో రూ.50 బిలియన్ డాలర్ల నష్టం: సునీల్ మిట్టల్
రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత టెలికం కంపెనీలు నష్టాల బారిన పడ్డాయని ఎయిర్‌టెల్ ఛైర్మెన్ సునీల్ మిట్టల్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత టెలికం కంపెనీలు నష్టాల బారిన పడ్డాయని ఎయిర్‌టెల్ ఛైర్మెన్ సునీల్ మిట్టల్ ప్రకటించారు.రిలయన్స్ జియో ఇచ్చిన ఉచిత ఆఫర్ల కారణంగా టెలికం కంపెనీలు 50 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను టెలికాం కంపెనీలు రైటాఫ్ చేసినట్టు సునీల్ మిట్టల్ ప్రకటించారు.
రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడంతోనే సంచలనాలు సృష్టించింది. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలను ఇస్తూ కష్టమర్లను తన వైపుకు తిప్పుకొంది రిలయన్స్ జియో. అయితే జియో కారణంగా ఇతర టెలికం కంపెనీలు నష్టపోయాయి.
రిలయన్స్ జియో అనుసరించిన బాటలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ నడవాల్సిన అనివార్య పరిస్థితులు కూడ నెలకొన్నాయి. ఈ తరుణంలోనే ఇతర టెలికం కంపెనీలు టారిప్ ప్లాన్లు మార్చాయి. జియో ఫీచర్ ఫోన్ల తరహలోనే స్మార్ట్‌ఫోన్లను చౌక ధరలకే అందించాలని ప్లాన్ చేస్తున్నాయి.

జియోతో 50 బిలియన్ డాలర్ల నష్టం
రిలయన్స్ జియో ఉచిత వాయిస్, డేటా ఆఫర్ల వెల్లువ టెలికాం కంపెనీలను భారీగా దెబ్బతీసింది. దాదాపు 50 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను టెలికాం కంపెనీలు రైటాఫ్ చేసినట్టు భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ తెలిపారు. ఇన్ని కోట్ల మేర పెట్టుబడుల రైటాఫ్‌కు ప్రధాన కారణం జియో ఉచిత కాల్స్, డేటా ఆఫర్లేనని సునీల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు.

ఎయిర్‌టెల్‌కు లాభమే
టెలికాం ఇండస్ట్రీలో వేగంగా జరిగిన కన్సాలిడేషన్‌తో భారతీ ఎయిర్‌టెల్ లబ్ది చెందిందని సునీల్ మిట్టల్ చెప్పారు. . నెంబర్ 2 వొడాఫోన్, నెంబర్3 ఐడియాలు విలీనం అపూర్వమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ రెండు బలమైన కంపెనీల విలీనాన్ని మనం చూడటం లేదని మిట్టల్ అన్నారు.

ఎయిర్‌సెల్ కొనుగోలుకు ఎయిర్‌టెల్ రెడీ
ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్... ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసేందుకు సన్నాహలు చేస్తోంది.ఈ మేరకు రెండు కంపెనీల మధ్య చర్చలు సాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఎయిర్‌సెల్ అంతకముందు, ఆర్‌కామ్‌లో విలీనమవ్వాలనుకుంది. కానీ ఆ విలీనం చివరి దశలో రద్దయింది.

కష్టమర్లను కాపాడుకోవడానికి టారిఫ్ మార్పులు
ట్రేడింగ్ డీల్ ద్వారా రూ.3,500 కోట్లకు ఎనిమిది సర్కిళ్లలో 2300 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో ఎయిర్‌సెల్ 4జీ ప్రసారాలను ఎయిర్‌టెల్ గతేడాది కొనుగోలు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో జియో ప్రవేశం అనంతరం దేశీయ టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి టారిఫ్ రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో ఛార్జీలు విధించడం ప్రారంభించింది. జియో కారణంగా టెల్కోల రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వలు భారీగా దెబ్బతిన్నాయి.












Click it and Unblock the Notifications