Uttarakhand: ఉత్తరాఖండ్ లో దుర్ఘటన- లోయలో పడ్డ టెంపో- 12 మంది మృత్యువాత.. !
ఉత్తరాఖండ్ లో ఇవాళ ఓ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రుద్రప్రయాగ్ లో ఓ టెంపో ట్రావెలర్ వాహనం అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో రోడ్డు పక్కన ఉన్న పలువురు స్థానికులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే క్షతగ్రాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న రైటోలి సమీపంలోని రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం లోయలో పడిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టిందని సీఎం పుష్కర్ సింగ్ థామీ తెలిపారు. ఈ ఘటన చాలా విచారకరమన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

ఉత్తరాఖండ్ లోని పుణ్యక్షేత్రాలకు యాత్రికులు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో టెంపో ట్రావెలర్ లో మొత్తం 23 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వారిలో క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి హెల్త్ బులిటెన్ లను విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు.
A tempo traveller fell into the Alaknanda river near Rudraprayag on the Badrinath highway…and 8 people have been reported to be dead till now. pic.twitter.com/xnDFKT1KAE
— Uttarakhand (@UttarakhandGo) June 15, 2024












Click it and Unblock the Notifications