మాస్క్‌తో వచ్చి నిద్రిస్తున్న గర్ల్‌ని ఎత్తుకెళ్లి అత్యాచారం

Ten year old raped in UP
లక్నో: ఆరు బయట నిద్రిస్తున్న ఓ పదేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి మాస్కు ధరించి వచ్చి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. నవాబ్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని లవఖేడా బద్రీప్రసాద్ గ్రామంలో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

గురువారం రాత్రి పదేళ్ల చిన్నారు గ్రామంలోని తన ఇంటి బయట నిద్రించింది. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను గ్రామ సమీపంలోని దట్టమైన ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అమ్మాయిని ఆ వ్యక్తి ఎత్తుకెళ్లుతున్న సమయంలో అరిచింది. ఆమె అరుపులు విన్న గ్రామస్థులు గాలించేందుకు ప్రయత్నించారు. కానీ నిందితుడు అంతలోనే ఆమెను దూరంగా తీసుకు వెళ్లాడు. గ్రామస్థులు రాత్రి ఆమె కోసం వెతికారు. అయితే ఉదయం ఆమె తిరిగి ఇంటికి వచ్చి చెప్పిన తర్వాతనే దారుణం తెలిసింది.

మాస్కు ధరించిన వ్యక్తి తీసుకెళ్తున్నప్పుడు బాధితురాలి వెనుక ఆమె సోదరి కూడా వెళ్లింది. ఆ ఘాతుకానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు దొరకలేదు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలికి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+