ఆప్ నాయకుడి మృతితో ఉద్రిక్తత: పోలీసులపై రాళ్ల దాడి!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నాయకుడు కుంజ్ బిహారీ నిషాద్ చికిత్స పొందుతూ మరణించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి వద్ద అతని కుటుంబ సభ్యులు, వందలాది మంది కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ గొడవల్లో రాళ్ల దాడి జరగడంతో ఒక పోలీస్ అధికారి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అసలేం జరిగింది?
కుంజ్ బిహారీ నిషాద్ బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారి. గతన మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆగస్టు 23న ఆయన తన బావమరిదితో కలిసి అభిషేక్ పాండే అనే వ్యక్తి ఇంటి వద్ద బకాయి ఉన్న రూ.50,000ను అడగడానికి వెళ్లాపు. అప్పుడు అభిషేక్ తన 10-12 మంది అనుచరులతో కలిసి కుంజ్ బిహారీ, అతని బావమరిదిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వారిని గోరఖ్‌నాథ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కుంజ్ బిహారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభిషేక్ పాండే, హిమాచల్ పాండే, మరో 12 మంది గుర్తు తెలియని వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదైంది.

ఆస్పత్రిలో ఆందోళన
ఆగస్టు 26న కుంజ్ బిహారీ నిషాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణం సంభవించిందని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు, ఆప్ కార్యకర్తలు ఆస్పత్రి లోపల, బయట ఆందోళన చేపట్టారు. ఈ గొడవలో ఆస్పత్రి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు.
పోలీసుల జోక్యం.. రాళ్ల దాడి
ఉద్రిక్తత పెరుగుతుండటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆప్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సమయంలో రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ దాడిలో గోరఖ్‌నాథ్ ఎస్‌హెచ్‌ఓ శశి భూషణ్ రాయ్ తలకు గాయమై తీవ్రంగా రక్తం కారింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి సిటీ స్కాన్ చేయించారు. పోలీసులు బలప్రయోగం చేసి ఆప్ నాయకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి పంపించారు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు.
यूपी के गोरखपुर में आम आदमी पार्टी के नेता को पीट-पीटकर अधमरा कर दिया गया.
— Ranvijay Singh (@ranvijaylive) August 26, 2025
अस्पताल में इलाज के दौरान नेता की मौत हो गई. परिवार वाले हंगामा करने लगे. पुलिस पहुंची तो पथराव किया.
यूपी पुलिस के SHO के सिर पर पत्थर लगा है. pic.twitter.com/do9aEE7ps1












Click it and Unblock the Notifications