వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్ట్15 టార్గెట్‌గా.. భారీ ఉగ్రకుట్ర భగ్నం; 30కేజీల ఐఈడీ సీజ్.. ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ అరెస్ట్!!

|
Google Oneindia TeluguNews

స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఉగ్రదాడులు చేయాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారా? దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కనిపిస్తున్న ఉగ్రవాదుల అలజడి అందుకు ఊతమిస్తోందా? ఉగ్రదాడులకు చెక్ పెట్టడం కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగాయా? ఇప్పటికీ రాష్ట్రాలవారీగా అప్రమత్తమైన పోలీసులు నిరంతరం నిఘాతో ఉగ్రవాద మూక ఆగడాలకు చెక్ పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

స్వాతంత్ర్య దినోత్సవం టార్గెట్ గా ఉగ్రదాడులకు ప్లాన్.. కుట్ర భగ్నం చేస్తున్న పోలీసులు

స్వాతంత్ర్య దినోత్సవం టార్గెట్ గా ఉగ్రదాడులకు ప్లాన్.. కుట్ర భగ్నం చేస్తున్న పోలీసులు

స్వాతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు చేసిన భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ సారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించి, దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అలలపైన భద్రతా బలగాలు, పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుండి 30 కిలోల ఐఈడి స్వాధీనం

తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుండి 30 కిలోల ఐఈడి స్వాధీనం


ఇదే సమయంలో జమ్మూకాశ్మీర్లోని పుల్వామా లో తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుండి 30 కిలోల ఐఈడిని స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. పుల్వామా పోలీసులకు, భద్రతా దళాలకు ఐఈడీ రవాణా గురించి పక్కా సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రతా బలగాలు తహాబ్ క్రాసింగ్ వద్ద పేలుడు పదార్థమైన ఐఈడిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో భారీ ఉగ్ర ముప్పు తప్పిందని భావిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని కాశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్ లో భద్రత కట్టుదిట్టం

జమ్మూ కాశ్మీర్ లో భద్రత కట్టుదిట్టం

లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ కి సంబంధించిన ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని పోలీసులకు అందిన సమాచారంతో కాశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వేస్టేషన్లను నిఘాను ముమ్మరం చేశారు. అదనపు బలగాలను మోహరించి నిత్యం గస్తీ కాస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు అడుగడుగున జల్లెడ పడుతున్నారు.

యూపీలో ఐఎస్ఐఎస్ కి చెందిన ఉగ్రవాది అరెస్ట్ టెర్రరిస్ట్

యూపీలో ఐఎస్ఐఎస్ కి చెందిన ఉగ్రవాది అరెస్ట్ టెర్రరిస్ట్


ఇదిలా ఉంటే స్వాతంత్ర దినోత్సవం రోజున దాడులకు ప్లాన్ చేసిన ఐఎస్ఐఎస్ కి చెందిన ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఆజంగఢ్ జిల్లా అమీలో ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఉగ్రవాది గా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తిని సబావుద్దీన్ అజ్మీ అలియాస్ దిలావర్ ఖాన్ అలియాస్ బైరం ఖాన్ అలియాస్ అజర్ గా గుర్తించారు. అతను ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సభ్యుడిగా గుర్తించారు.

ఉగ్రవాద కదలికలపై అడుగడుగునా నిఘా

ఉగ్రవాద కదలికలపై అడుగడుగునా నిఘా

భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోని సానుభూతిపరుల నుంచి ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించి పంపినందుకు ఐఎస్ఐఎస్ కు సంబంధించిన ఒక ఉగ్రవాదిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం మళ్లీ ఐఎస్ఐఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్న మరో సభ్యుడిని అరెస్ట్ చేయడం గమనార్హం. ఇక ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.

English summary
Security forces foiled a huge terror plot targeted by Terrorists on August 15. 30 kg IED seized in Pulwama. An ISIS terrorist was arrested in Azamgarh, UP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X