"పహల్గామ్ ఉగ్రవాదులను నాలుగు సార్లు కలిశా"
ఏప్రిల్ 22 న జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన మారణహోమం నేపథ్యంలో అధికారులు మహమ్మద్ యూసుఫ్ కటారీ(26)ను అరెస్ట్ చేశారు. ఉగ్రదాడి సమయంలో టెర్రరిస్టులకు లాజిస్టిక్స్ సాయం చేసినట్లుగా గుర్తించారు. ఈ విషయంపై అక్టోబర్ 5 న అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. కటారీ.. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్ అలియాస్ అసిఫ్, జిబ్రాన్, హమ్జా అఫ్గానీ లను నాలుగు సార్లు కలిసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు.
కటారీ.. ఆ ఉగ్రమూకలకు లాజిస్టిక్స్ సరఫరా చేసినట్లు తేలిందన్నారు. అందులో ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్ ఉంది. ఉగ్రవాదులను శ్రీనగర్ అవతల ఉన్న జబర్ వాన్ హిల్స్ లో కలిసినట్లు స్పష్టమైంది. పహల్గామ్ ప్రాంతానికి ఎలా రావాలో వాళ్లకు తెలియజేసినట్లు తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ మహాదేవ్ పేరిట ఉగ్రమూకలను, వారికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ ఆపరేషన్ లో భాగంగా ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. వారి వద్ద నుంచి కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఫోన్ ఛార్జర్ కూడా ఉంది. ఈ ఛార్జర్ తో కటారీని ఉగ్రవాదులు ట్రాకింగ్ చేసేవాళ్లు.

ఇప్పటివరకూ పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న నలుగురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2019లో పుల్వామా దాడి తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావించవచ్చు. జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలడంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది.
వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications