పేట్రేగిన ఉగ్రవాదులు: ప్రతిపక్ష నేత ఇంట్లోకి జొరబడి..కాల్పులు: కాపాడిన సెక్యూరిటీ

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ప్రతిపక్ష పీపుల్డ్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత హాజీ పర్వేజ్ అహ్మద్ నివాసంలోకి చొరబడి మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన వ్యక్తగత భద్రత సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. కాశ్మీర్ జోన్ పోలీసులు దీన్ని ఉగ్రవాద చర్యగా నిర్దారించారు. వారి కోసం గాలింపు చర్యలను చేపట్టినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన అహ్మద్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. శ్రీనగర్‌లోని నటిపొరా ప్రాంతంలో పర్వేజ్ అహ్మద్ నివాసం ఉంటున్నారు.

ఈ ఉదయం ముఖానికి మాస్కులను ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన నివాసంలోకి చొరబడ్డారు. భద్రతా సిబ్బంది వారిని ప్రశ్నించేలోపే కాల్పులు జరిపారు. పర్వేజ్ అహ్మద్‌ను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. సుమారు నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు చొరబడిన విషయం తెలుకున్న వెంటనే పర్వేజ్ అహ్మద్ భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మంజూర్ అహ్మద్ అనే సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Terrorists enter PDP leader Haji Ahmed’s house in Srinagar, open fire

ఈ ఘటన పట్ల పీడీపీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పర్వేజ్ అహ్మద్‌కు ఫోన్లు చేసి, పరామర్శించారు. తాను క్షేమంగా ఉన్నానని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది గాయపడినట్లు వివరించారు. శ్రీనగర్ జోన్ పోలీస్ కమిషనర్.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పర్వేజ్‌తో మాట్లాడారు. అనంతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. పర్వేజ్ అహ్మద్ ఇంటికి మరింత గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. గాయపడ్డ వ్యక్తి భద్రతా సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయని, ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+