Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్ సభలో కలకలం, బీజేపీ ఎంపీ పాస్ లు ఎలా వచ్చాయి ?, 22 ఏళ్లకు సీన్ రిపీట్ కు స్కెచ్ ?

లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్ సభలోకి కొందరు దుండగులు చొరబడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2001 డిసెంబర్ 13వ తేదీన లోక్ సభపై దాడి జరిగిన 22 ఏళ్ల తరువాత అదే రోజు లోక్ సభలోకి దుండగులు చొరబడటంతో ఎంపీలు హడలిపోయారు. దేశంలోని ఎక్కడాలేని కట్టుదిట్టమైన భద్రత ఉండే లోక్ సభలో ఇలాంటి సంఘటన జరడంతో ప్రపంచ దేశాలు ఢిల్లీ వైపు తిరిగిచూశాయి.

లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సందర్బంలో ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోని విజిటర్స్ గ్యాలరీలో నుంచి కిందకు దూకుతూ నినాదాలు చెయ్యడం, అదే సమయంలో మరో వ్యక్తి ఒక రకమైన రంగు పొగను వదలడంతో ఎంపీలు హడలిపోయారు. అదే సందర్బంలో లోక్ సభ బయట కూడా ఇద్దరు దుండగలు ఇదే తరహాలో ఆందోళనకు దిగి రంగు పొగను వదడం కలకలం రేపింది.

The accused entered the Lok Sabha carrying passes with letters of recommendation from BJP MP Pratap Simha

లోక్ సభలోకి చొరబడిన దండుగులను కర్ణాటకలోని మైసూరు జిల్లాకు చెందిన డి. మనోరంజన్, సాగర్ శర్మగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని ఓ పోలీసు అధికారి ఆయన్ను కలిసి మీడియాకు చెప్పారు. ఢిల్లీ పోలీసులు అధికారికంగా వారి పేర్లు వెళ్లడించారు. మరో ఇద్దరు హరియానాలోని హిసార్ కు చెందిన నీలం (42), మహారాష్ట్రకు చెందిన అమోల్ షిందే (25)గా పోలీసులు గుర్తించామని పోలీసు అధికారులు అంటున్నారు.

కర్ణాటకలోని మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా బంధువులు మేము అని చెప్పిన డి. మనోరంజన్, సాగర్ శర్మా లోక్ సభలోకి ప్రవేశించడానికి విజిటర్స్ పాస్ లు తీసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. వీరిలో మనోరంజన్ ఇంజనీర్ అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుతో దుండగులు పాస్ లు ఎలా తీసుకున్నారు ? అంటూ ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

The accused entered the Lok Sabha carrying passes with letters of recommendation from BJP MP Pratap Simha

లోక్ సభలో ఎంట్రీకి పాస్ లు తీసుకోవడం చాలా కష్టం. అయితే 2001 డిసెంబర్ 13వ తేదీని మళ్లీ గుర్తు చెయ్యడానికి ఈరోజు లోక్ సభలోకి ఎంట్రీ ఇవ్వడానికి పక్కాప్లాన్ తో పకడ్బందిగా దుండగులు లోక్ సభలోకి ఎంట్రీ ఇవ్వడానికి పాస్ లు తీసుకున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎంపీ శిఫారస్సుతోనే ఇద్దరు దుండగులు లోక్ సభలోకి ప్రవేశించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

దండుగులను ఎంపీకి ఎవరైనా పరిచయం చేశారా ? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతావ్యవస్థ ఉన్న లోక్ సభలోకి వాయువును వెదజల్లే పరికరాలు తీసుకెళ్లడం కలకలం రేపింది. 2001 డిసెంబర్ 13వ తేదీన లోక్ సభలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 9 మంది వీరమరణం పొందిన విషయం తెలిసిందే. కచ్చితంగా 22 ఏళ్ల తరువాత అదే రోజు అంటే 2023 డిసెంబర్ 13వ తేదీన మరోసారి దుండగులు లోక్ సభలోకి ఇలా ప్రవేశించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+