స్కూల్ ముందే ఇన్నోవా కారులో లేడీ టీచర్ కిడ్నాప్, పెళ్లిచూపులకు వెళ్లిన యువకుడితో ? !

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కారణంతో ఓ స్కూల్‌ టీచర్‌ని కిడ్నాప్‌ చేసిన ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లా బిట్టగౌడనహళ్లి సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

కిడ్నాప్‌కు గురైన ఉపాధ్యాయురాలు పేరు అర్పిత. పనిచేస్తున్న పాఠశాల ఎదుటే లేడీ టీచర్ అర్పితను కొందరు కిడ్నాప్ చేశారని ప్రత్యక్ష సాక్షలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

The accused kidnapped the unmarried lady teacher in an Innova car in front of the school in Hassan

ఇన్నోవా కారులో లేడీ టీచర్ అర్పితను కిడ్నాప్ చేసినట్లు స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. లేడీ టీచర్ అర్పితా చాలా ప్రతిఘటించినా కిడ్నాపర్లు మాత్రం ఆమెను వదిలిపెట్టకుండా కారులో ఎత్తుకువెళ్లారని, ఆమెను రక్షించడానికి కొందరు విద్యార్థులు, మేము ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని ప్రత్యక్ష సాక్షలు చెప్పారని పోలీసులు అన్నారు..

15 రోజుల క్రితం అర్పిత ఇంటికి వెళ్లిన రాము అనే వ్యక్తి పెళ్లి ప్రపోజ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో రాము వెంట అతని తల్లిదండ్రులు, బంధువులు అంటూ కొందరు లేడీ టీచర్ అర్పితా ఇంటికి వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాము అనే వ్యక్తికి అర్పితను ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారని, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అర్పితా కూడా రాము అనే వ్యక్తికి మంచిగానే చెప్పిందని పోలీసులు అన్నారు.

పెళ్లికి అర్పితాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో రాము, అతని వెంట వెళ్లిన కొందరు వ్యక్తులు ఆరోజు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు అంటున్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం లేడీ టీచర్ అర్పిత పాఠశాలకు వెళ్లే సమయంలో ఇన్నోవా కారులో వచ్చిన కొందరు ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన హసన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

The accused kidnapped the unmarried lady teacher in an Innova car in front of the school in Hassan

పెళ్లికి నిరాకరించిన రామునే అతని స్నేహితులతో కలిసి లేడీ టీచర్ అర్పితాను కిడ్నాప్ చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే అర్పితాతో పాటు కిడ్నాపర్లు ఇంత వరకు చిక్కకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+