ద్వేష వ్యాఖ్యలు: ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి పేరు?
ఆగ్రా: వీహెచ్ పీ నేత హత్య నేపథ్యంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుల మీద ఆగ్రా పోలీసులు కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. బీజేపీ నేత, స్థానిక కార్పొరేటర్ కుందనిక శర్మతో పాటు నలుగురి మీద కేసులు నమోదు చేశామని బుధవారం పోలీసు అధికారులు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన వీహెచ్ పీ నేత అరుణ్ సంస్మరణసభ ఆగ్రాలో జరిగింది. ఈ సభలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రాంశంకర్ కరేరియా, బీజేపీ ఎంపీలు బాబూలాల్, సాధ్వి ప్రాచి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

వీరి మీద కేసులు నమోదు చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఓ మంత్రితో పాటు బీజేపీ నాయకుల పేర్లు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. మంత్రితో పాటు ఇద్దరు ఎంపీలు, ఓ శాసన సభ్యుడి పేరు ఎఫ్ఐఆర్ లో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.
వీహెచ్ పీ నేత హత్య జరిగిన తరువాత కేంద్ర మంత్రి రాంశంకర్ కఠేరియా, బీజేపీ నాయకులు ఓ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడి రెచ్చగొట్టారని వెలుగు చూసింది. రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చెయ్యడంతో పోలీసు అధికారులు బీజేపీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications